కేవీపీని వెంటనే అరెస్టు చేయాలి: టీఆర్‌ఎస్

హైదరాబాద్: వైఎస్ అంతరంగికుడు, ప్రధాన అనుచరుడుగా చలామణి అయిన కేవీపీ రామచంద్రరావును వెంటనే అరెస్టు చేయాలని టీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈమేరకు ఇవాళ ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ శ్రవణ్ విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మార్ కేసులో నిందితుడుగా ఉన్న బీపీ ఆచార్య జైళ్లో ఉంటే కేవీపీ బయట ఎలా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపాలని శ్రవణ్ డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.