కేబినెట్ నోట్‌లోని కీలక అంశాలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. కేబినెట్ నోట్‌లోని కీలక అంశాలు.. పది జిల్లాలతో తెలంగాణ ఏర్పాటు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. సత్వరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై నిర్ణయం. నిర్దేశిత గడువులోగా రాజధాని మార్పిడి ప్రక్రియ. ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలకూ ఒకే హైకోర్టు. నీటి పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకుంటే అంతిమ నిర్ణయం కేంద్రానిదే. రాజ్యసభ స్థానాల విభజన : తెలంగాణ -8, ఆంధ్రప్రదేశ్ -10. లోక్‌సభ స్థానాల విభజన : తెలంగాణ -17, ఆంధ్రప్రదేశ్ -25. శాసనమండలి కొనసాగింపు నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే. అసెంబ్లీ స్థానాల విభజన : తెలంగాణ -119, ఆంధ్రప్రదేశ్ -175. తెలంగాణ అసెంబ్లీకి ఒక నామినేటెడ్ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్. తెలంగాణకు కొత్త స్పీకర్, డిప్యూటీ స్పీకర్. లోక్‌సభ రిజర్వేషన్ల సంఖ్య : ఎస్సీ-3, ఎస్టీ -2. అసెంబ్లీ రిజర్వేషన్ల సంఖ్య : ఎస్సీ -19, ఎస్టీ -12. రెండు ప్రాంతాలకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు. ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల నియామకాలు ఏపీపీఎస్సీ ద్వారానే జరగనున్నాయి.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.