కేజ్రీవాల్‌కు విదేశీ ‘సుపారీ’- ఖండించిన కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ సారథ్యం వహిస్తున్న అవినీతి వ్యతిరేక భారత్ సంస్థకు అనుమానాస్పదంగా విదేశీ నిధులు అందుతున్నాయని బీజేపీ పత్రిక కమల్ సందేశ్ వివాదాస్పద కథనం ప్రచురించింది. అందుకే బీజేపీ అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ వ్యతిరేకంగా అసత్యారోపణలు చేస్తున్నారని కథనంలో ఆరోపించింది. ఆ పత్రిక తాజా సంచిక సంపాదకీయంలో కేజ్రీవాల్ విదేశీ సంస్థల నుంచి సుపారీ (కాంవూటాక్టు) తీసుకున్నారని ఆరోపణలు చేసింది. దీనిపై కేంద్రం విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. కాగా,బీజేపీకి విరాళాలు ఎక్కడినుంచి వస్తున్నాయో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. బీజేపీ పత్రిక కథనాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.