కేంద్ర హోంశాఖ నివేదికపై ఆమోస్ ఆగ్రహం

హైదరాబాద్ : విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ సమర్పించిన నివేదికపై ఎమ్మెల్సీ ఆమోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవోఎంకు ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తదని హెచ్చరించారు. తెలంగాణ అంశాన్ని జఠిలం చేసే కుట్రలో భాగంగానే ఈ వ్యవహారం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌పై అధికారాలను గవర్నర్‌కు ఇస్తే ప్రజలను ఎవరు పట్టించుకోవాలని ప్రశ్నించారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నడుచుకోవాలనే కిరణ్‌ను సీఎంగా ఎన్నుకున్నప్పుడు సీఎల్పీలో మెజార్టీ ఉండా అని అడిగారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.