కేంద్ర హోంశాఖకు టాస్క్‌ఫోర్స్ నివేదిక

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖకు ఆశాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ నివేదిక సమర్పించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో పర్యటించి 29 పేజీల నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి అందజేసింది. పాలనావ్యవస్థ ఏర్పడే వరకు పోలీసు అకాడమీని ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని సిఫార్సు చేసింది. గ్రేహౌండ్స్, అక్టోపస్, కౌంటర్ ఇంటలిజెన్స్‌లను, పోలీసు వైర్‌లెస్, పోలీసు రవాణా వ్యవస్థలను ఇరు రాష్ట్రాలు వినియోగించుకోవాలని, పోలీసు శాఖలో కొరతను బట్టి నియామకాలు జరుపుకోవాలని టాస్క్‌ఫోర్స్ సిఫార్సు చేసింది.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.