కేంద్ర కేబినెట్‌లో సీమాంధ్రకే పెద్ద పీట

– కావూరి, జేడీతో 13కు చేరిన రాష్ట్ర బలగం
– అందులో ముగ్గురే తెలంగాణ మంత్రులు
– కేబినెట్ మంత్రుల్లో ఒక్కరే తెలంగాణ నేత
– సీనియర్లను పట్టించుకోని హైకమాండ్
– టీ ఎంపీల్లో తీవ్ర అసంతృప్తి
కేంద్ర కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణకు మళ్లీ మొండి చెయ్యే చూపించింది. సోమవారం జరిగిన విస్తరణలో రాష్ట్రం నుంచి ఆంధ్రా ప్రాంతానికి చెందిన కావూరి సాంబశివరావు , శీలం జేసుదాసు (జేడీ శీలం)కు చోటు కల్పించారు. తెలంగాణ ప్రాంత నేతలను అధిష్ఠానం లెక్కలోకి తీసుకోలేదనే విషయం తాజా విస్తరణ ద్వారా మరోసారి స్పష్టమైంది. తెలంగాణ నుంచి సీనియర్ ఎంపీలు ఉన్నప్పటికీ వారిని విస్మరించిన తీరుపై తెలంగాణవాదుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. టీ కాంగ్రెస్ నేతల్లో సైతం తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. కేంద్రంలో బెర్త్ కోసం ఆశలు పెట్టుకున్న పలువురు కాంగ్రెస్ ఎంపీలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడినప్పుడు.. మిగతా ఎంపీలను బుజ్జగించిన హైకమాండ్.. తాజా విస్తరణలో వారికి మొండి చేయి చూపించింది. గతంలో పార్టీని, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కావూరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఇచ్చిన అధిష్ఠానం.. అదే పార్టీకి విశ్వాసపావూతులుగా ఉంటున్న తెలంగాణ సీనియర్లను అవమానపరిచేలా వ్యవహరించిందని పలువురు విమర్శిస్తున్నారు. పనికిరాని ప్రభుత్వమని, నిర్ణయాలు తీసుకునే శక్తిలేదంటూ గతంలో కావూరి చేసిన ఘాటు వ్యాఖ్యలను, పార్టీపరంగా లభించిన పదవులకు ఆయన రాజీనామాలు చేసిన విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. అలాంటి నేతను పార్టీ పెద్దలు బుజ్జగించి, సీడబ్ల్యూసీలోకి రెడ్‌క్పాట్ వేయడమే కాకుండా.. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన తన పంతం నెగ్గించుకున్నట్లయింది. తెలంగాణ ప్రాంతం నుంచి వీ హన్మంతరావు, గుత్తా సుఖేందర్‌డ్డి లాంటి సీనియర్ ఎంపీలు ఉన్నా.. వారిని కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోకపోవడం.. తెలంగాణపట్ల వివక్షనే వెల్లడిస్తోందని అంటున్నారు.

రాష్ట్రం నుంచి 13కి చేరిన మంత్రుల సంఖ్య
ప్రస్తుతం 13కు చేరిన రాష్ట్ర మంత్రుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి ముగ్గురే ఉన్నారు. వీరిలో జైపాల్‌డ్డి కేబినెట్ హోదాలో ఉండగా, మిగతా ఇద్దరు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ సహాయ మంత్రి పదవులకే పరిమితమయ్యారు. మిగిలిన పది మందిలోనూ జైరాం రమేష్ మన రాష్ట్రానికి చెందిన నేత కాక పోయినా, ఇక్కడి నుంచి ఆయన రాజ్యసభకు వెళ్ళడంతో కాంగ్రెస్ వర్గాలు ఆయన్ని ఆంధ్రవూపదేశ్ కోటాలోనే పరిగణిస్తున్నాయి. జైరాం కూడా ఆంధ్రావూపాంత జిల్లానే తన అభివృద్ధి కార్యక్షికమాల కోసం ఎంచుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. మిగతా 9 మంది మంత్రుల్లో ఒకరు రాయలసీమ నుంచి, మిగతా ఎనిమిది మంది ఆంధ్రా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాఖల ప్రాధాన్యంలోనూ అదే వివక్ష కనిపిస్తుంటుంది. జైపాల్‌డ్డి శాఖ అప్రధానమైనది. కిషోర్‌చంవూదదేవ్‌కు కీలకమైన పంచాయతీరాజ్ శాఖ ఉండగా కావూరికి జౌళి, పళ్లంరాజుకు మానవవనరుల అభివృద్ధి శాఖను అప్పజెప్పారు. కేంద్ర కేబినెట్‌కు సమాన హోదా కలిగిన పార్లమెంట్‌లోని పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా రాజమండ్రి ఎంపీ ఉండవల్లి ఆరుణ్‌కుమార్ ఉన్నారు.

ఒకే ఒక బీసీ: సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే బీసీల నుంచి ఒక్క కిల్లి కృపారాణి మాత్రమే ఉన్నారు. అదే తెలంగాణలోని బీసీ వర్గానికి చెందిన సీనియర్ ఎంపీ వీ హన్మంతరావు మూడుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ, ఏఐసీసీలో కార్యదర్శిగా సేవలు అందించినా ఆయనకు అవకాశం కల్పించకపోవడం టీ కాంగ్రెస్ నేతలను నిరాశపర్చింది. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ, సికింవూదాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ కూడా సీనియర్ల జాబితాలోనే ఉన్నా వారినీ ఖాతరు చేయలేదు. ఎస్సీల్లో మాల సామాజికవర్గం నుంచి పనబాక లక్ష్మీతో పాటు తాజాగా జేడీ శీలంతో వారి సంఖ్య రెండుకు చేరింది. తెలంగాణ నుంచి మాదిగ సామాజికవర్గానికి చెందిన సర్వే సత్యనారాయణ ఒక్కరే ఉన్నారు. తెలంగాణ నుంచి ఆరు సార్లు ఎంపీగా గెలిచిన నంది ఎల్లయ్య మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అడియాసలే అయ్యాయి. జేడీ శీలం మంత్రికావడం పట్ల మాల సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌నుంచి పని చేస్తూ.. ఎంపీగా మూడుసార్లు గెలిచిన మాల సామాజికవర్గం నేత హర్షకుమార్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఏఐసీసీలో అదే తీరు
ఏఐసీసీ కూర్పులోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది. కొత్త కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఇద్దరికి కార్యదర్శి పదవులిచ్చి హైకమాండ్ చేతులు దులుపుకున్నది. అధిష్ఠానానికి విధేయుడన్న పేరున్న వీహెచ్‌కు పార్టీలోనూ పదోన్నతి లభించకపోవడం ఆయనకు ఉన్న తెలంగాణ మార్కేనని అంటున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కావూరికి సీడబ్ల్యూసీలో అవకాశం కల్పించి, కేంద్రంలో కేబినెట్ హోదాతో జౌళి శాఖ కేటాయించారని, వీహెచ్‌ను మాత్రం ఏఐసీసీలో మళ్ళీ కార్యదర్శిగానే నియమించి, గతంలో ఉన్న రాష్ట్రాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించడం అవమాన పరచడమేనని టీ వాదులు నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ విషయంలో ఇటీవలి కాలంగా మౌనంగా ఉంటున్న జీ చిన్నాడ్డికి నామ్‌కే వాస్తే అంటూ ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇచ్చి తెలంగాణకు కూడా పదవి ఇచ్చినట్లు చూపించుకున్నారని అంటున్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.