కేంద్రమంత్రి గల్ల పట్టిన డీసీసీబీ ఛైర్మన్ జంగా

వరంగల్ : వారిద్దరు అధికారపార్టీ నేతలు.. పైగా ప్రజాప్రతినిధులు ఒకరు కేంద్రమంత్రి, మరోకరు డీసీసీబీ ఛైర్మన్ ఇంకేముంది గల్లాలు పట్టుకుని వీది రౌడిల్లా ప్రవర్తించి పార్టీ పరువును బజారునా పడవేశారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణను తామే సాదించామని చెప్పుకునేందకు జిల్లాలో తలపెట్టిన ‘కాంగ్రెస్ జైత్రయాత్ర’పై రాష్ట్రమంత్రి పొన్నాల నివాసంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సమావేశమైన కాసేపటికే కేంద్రమంత్రి బలరాం నాయక్, డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డిల మధ్య వాగ్వాదం మొదలైంది. అది తీవ్రతరమై జంగా రాఘువరెడ్డి కేంద్రమంత్రి బలరాంనాయక్ కాలర్ పట్టుకొని నెట్టివేశాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమావేశాన్ని మధ్యలోనే ముగించారు.ఇప్పటికే డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డిపై రౌడీషిటర్ నమోదై ఉండటం విశేషం.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.