కేంద్రపాలితంపై ఏమీ చెప్పలేను

-బొత్సతో భేటీ అనంతరం దిగ్విజయ్
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే విషయంలో ఆంటోనీ కమిటీ సమీక్షిస్తుందని, దానిపై తాను ఏమీ చెప్పలేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. రాష్ట్ర విభజన అంశాన్ని పర్యవేక్షిస్తున్న ఆంటోనీ కమిటీ ఆ సంగతి చూసుకుంటుందని అన్నారు.
సోమవారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఒప్పుకున్నాకనే తీసుకున్నామని పునరుద్ఘాటించారు. అందులో వ్యతిరేకత ఉండే అవకాశం లేదన్నారు. వివిధ సంఘాల నేతలు, పార్టీలు ఆంటోనీ కమిటీని కలుస్తున్నారని చెప్పారు. అంతకుముందు బొత్సతో భేటీ జరిపిన దిగ్విజయ్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను వివరించిన ఆయన.. విభజనపై యూపీఏ ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం తీరుతెన్నులను దిగ్విజయ్‌సింగ్‌కు బొత్స వివరించినట్లు తెలిసింది

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.