కృష్ణమ్మను చెరపట్టే కుట్ర

హైదరాబాద్ పిల్లల చదువులు, ఉద్యోగాలు అన్ని ఎన్ని కబుర్లు చెప్పినా రాయల తెలంగాణ అంశం ముందుకు తెచ్చిన సీమ నేతల ఏకైక లక్ష్యం కృష్ణానది నీళ్ల దోపిడీయేనని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో బాంబులేసి దౌర్జ్యన్యంగా నీళ్లు మళ్లించుకున్న నాయకులు రాష్ట్రం విడిపోతే ఆ ఛాన్స్ ఉండదనే కుంటిసాకులు ముందుపెట్టి రాయల తెలంగాణ కుట్ర చేశారని వారంటున్నారు. అందర్నీ దబాయించి జబర్దస్తీగా నీళ్లు మళ్లించుకుని, బ్యాంకులు పైసా ఇవ్వకపోయినా రాష్ట్ర ఖజానా కొల్లగొట్టి ప్రాజెక్టులు ప్రారంభించుకుని, పోతిడ్డిపాడు ద్వారా కృష్ణానదినే మళ్లించుకున్న వారు ఇపుడు ఆ ప్రాజెక్టులు జలదోపిడీ కుదరదనే దిక్కుమాలిన ప్రస్తావన తెచ్చి రాష్ట్ర ఏర్పాటును క్లిష్టంగా మార్చారని అంటున్నారు.
water
సీమలోని రెండు జిల్లాలను తెలంగాణలో కలపడం ద్వారా రాజకీయ అధిపత్యమేకాదు కృష్ణా బేసిన్ ఆవలివైపున ఉన్న అక్రమ ప్రాజెక్ట్‌లను కూడా సక్రమం చేసుకొని జలదోపిడీని శాశ్వతం చేసుకోవచ్చన్న కుటిల యత్నం కనిపిస్తోంది. గాలేరు-నగరి సుజల స్రవంతి వంటి అనుమతిలేని ప్రాజెక్ట్‌లు మొదలుకుని దుమ్ముగూడెం -నాగార్జునసాగర్ వరకు తెలంగాణకు చెందాల్సిన నికర, మిగులజలాలపై హక్కు సాధించే వీలుంటుందనే భావనతో సీమాంధ్ర నాయకులు రాయల తెలంగాణకు పట్టుబడుతున్నారనే బలమైన అనుమానాలున్నాయి.

రాష్ట్రం విడిపోతే రాయలసీమకు ఎగువనున్న తెలంగాణనుంచి చుక్కనీరు రాదని మొదటినుంచీ అక్కడి నాయకులు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో తమ రెండు జిల్లాలను తెలంగాణలో కలపాలని కర్నూలు, అనంతపురంకు చెందిన ప్రజావూపతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అట్లా చేస్తే జలవివాదాలు, సరిహద్దుసమస్యలు చాలా వరకు తీరిపోతాయని వాదిస్తూ ఢిల్లీలో యూపీఏ సర్కార్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఎటువంటి జల కేటాయింపులు లేకుండానే సీమ పరిధిలో హంద్రీ-నీవాసుజల స్రవంతి, గాలేరు-నగరి సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్ట్‌లను నిర్మించారు. కృష్ణాబేసిన్‌లో లేని ఈ ప్రాజెక్ట్‌లను రద్దు చేయాలని తెలంగాణ జలరంగ నిపుణులు వాదిస్తున్నారు. కృష్ణా నది పరిధిలో లేని తెలుగుగంగకు 25 టీఎంసీలను, ప్రతిపాదిత ఆర్డీఎస్ కుడికాలువ కింది ప్రాజెక్ట్‌లకు నాలుగు టీఎంసీల నీటిని కేటాయించడం కూడా వివాదంగా మారింది.

సీమాంవూధుల ఏలుబడిలోని సర్కార్ తెలంగాణను దెబ్బతీసే విధంగా కృష్ణాబేసిన్‌లో లేని ప్రాజెక్ట్‌లకు నీటిని కేటాయించేలా జస్టిస్ బ్రిజెష్ ట్రిబ్యునల్ ముందు వాదించి ఒప్పించిందని ఇక్కడి జలరంగ నిపుణులు ఆగ్రహంతో ఉన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లకు నీటిని కేటాయించిన తర్వాతే అనుమతిలేని ప్రాజెక్ట్‌లకు నీటిని కేటాయించాలని తెలంగాణవాదులు సుప్రీంకోర్టులో వాదించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి రాయలసీమలోని హంద్రీ-నీవా,గాలేరు- నగరి ప్రాజెక్ట్‌లు అక్రమమని తేలడంతో ఏ బ్యాంక్ కూడా వాటి నిర్మాణానికి రుణాలివ్వడానికి ముందుకు రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే వార్షిక బడ్జెట్ నుంచి నిధులను మళ్లించి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికీ హంద్రీనీవా రెండోదశ పనులు, గాలేరు నగరి పనులు ఇంకా పూర్తి కాలేదు. వెలిగొండ పరిస్థితి అదే.

రెండు జిల్లాలను తెలంగాణలో కలపడం వల్ల నిధుల కొరత తీరి నీటి తరలింపునకు అడ్డు ఉండదని సీమవూపాంత నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కింద తెలంగాణకు రావాల్సిన 15 టీఎంసీల నీటికి గండి కొడుతున్న సీమనాయకులు తెలంగాణ ఏర్పడితే భవిష్యత్తులో తమ ఆటలు సాగవనే ఆందోళనతో ఉన్నారు. కేసీ కెనాల్ ద్వారా దౌర్జన్యంగా నీటిని తరలించడం వల్ల తెలంగాణ పాలమూరుకు 5టీఎంసీల నీరు కూడా రావడం లేదు. బ్రిజెష్ ట్రిబ్యునల్ ఉనికిలో లేని రాజోలిబండ కుడికాలువకు నాలుగు టీఎంసీల నీటిని కేటాయించడం వివాదాస్పదంగా మారిం ది. రికార్డులలో ఇప్పటివరకు ఆర్డీఎస్ కుడికాలువ లేకపోవడం గమనార్హం. కొత్తగా చేపడుతున్న దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ ద్వారా గోదావరి నుంచి మళ్లించే 160 టీఎంసీల నీటిని తమకు అనుకూలంగా మలుచుకోవచ్చన్న ఆలోచనతో సీమ నాయకులున్నారని ప్రచా రం. గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్ ద్వారా నల్లగొండ, మిర్యాలగూడకు సరఫరాచేసి తద్వారా అంతమొత్తం నీటిని శ్రీశైలం కిందకు వదలకుండా పోతిడ్డిపాడు హెడ్‌గ్యులేటర్ ద్వారా తరలించే కుట్రలు రాయలతెలంగాణ ప్రతిపాదనలో ఉన్నాయని తెలంగాణ ప్రాంత నీటిపారుదల రంగనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ ప్రాజెక్టులు మేమెందుకు మోయాలి: వీ ప్రకాశ్
రాయలసీమ అక్రమ ప్రాజెక్ట్‌లను మోయడానికి సిద్ధంగాలేమని నీటిపారుదల రంగ విశ్లేషకులు , జయశంకర్ తెలంగాణ ఆర్‌అండ్ డీ అధ్యక్షుడు వీ ప్రకాశ్ అన్నారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన నీటిని కొల్లగొడుతున్న సీమ నాయకులు రెండు జిల్లాలను కలపడం ద్వారా మరింత దోపిడీకి తెగబడే ప్రమాదముందన్నారు. ఆర్డీఎస్ కింద సీమ బడానాయకునికి పవర్ ప్రాజెక్ట్ ఉందని, కొత్తగా నాలుగు టీఎంసీలు కేటాయించడంతో ప్రాజెక్ట్‌కు నీటిని మళ్లించుకుని తెలంగాణ నీటిని అక్రమంగా తరలించుకుపోయే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పెత్తనంతో పాటు జలదోపిడీని కొనసాగించేందుకు వీలుగా రాయలతెలంగాణ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

అక్రమాలను సక్రమం చేసుకోవడానికే: శ్యామ్‌వూపసాద్‌డ్డి
కృష్ణా బేసిన్‌లో లేని తమ అక్రమ వూపాజెక్ట్‌లను సక్రమం చేసుకోవడానికి, జలదోపిడీ కొనసాగింపునకు సీమనాయకులు కుట్ర చేస్తున్నారని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం ప్రధానకార్యదర్శి మేరెడ్డి శ్యామ్‌వూపసాద్‌డ్డి అంటున్నారు. సీమ ప్రాంతం ఎడారి అవుతుందని బ్రిజేష్‌కు తప్పుడు నివేదిక ఇచ్చి తెలుగుగంగ, ఆర్డీఎస్‌కు నీటి కేటాయింపులు చేసుకున్న సీమ నాయకులు రెండు జిల్లాలను కలపడం ద్వారా మిగిలిన జలవనరులను దోచుకునేందుకు కాచుకుని ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికే బలవూపయోగంతో మహబూబ్‌నగర్‌కు తీరని అన్యాయం చేసినవారిని, పోతిడ్డిపాడు హెడ్‌గ్యులేటరీ ఎత్తుపెంచి తెలంగాణకు గండికొట్టిన వారిని ఎలా నమ్ముతామన్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.