కిల్లర్‌ సూర్యం-వడదెబ్బకు 234 మంది మృతి

 

ladydead
ఉరుముతున్న రోహిణీ కార్తె.. ఉసురు తీస్తున్న వడగాడ్పులు
రోహిణి కార్తె ఉరుముతోంది. రాష్ట్రంపై నిప్పులవాన కురిపిస్తోంది. జనం పెనంపై నిలబడినట్లు విలవిల్లాడిపోతున్నారు. రోడ్డుపైకి వస్తే ప్రాణాలతో ఉంటామో లేదో తెలియని పరిస్థితి! తట్టుకోలేనివారు ఉన్నచోటే ప్రాణాలొదిలేస్తున్నారు. నడి ఎండనైనా భరించి కూలి పనులు చేసుకోనిదే రోజు గడవని పేదలు.. కనీస నీడలేని ప్రాంతాల్లో పనులు చేసుకునే ఉపాధి హామీ కూలీలు, గూడులేని పేదలు.. భిక్షాటన చేసేవారు.. అనారోగ్యంతో ఉండి.. ఎండలో రోడ్లపైకి వచ్చినవారు.. ఎక్కడివారక్కడే రాలిపోతున్నారు. ఫలితం.. ఒక్క శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా 234 మరణాలు! అందులోనూ తెలంగాణలో 116 దిక్కులేని చావులు! సీమాంధ్ర ప్రాంతంలో 118 దయనీయ మరణాలు! రోహిణిలో రోళ్లు బద్దలవుతాయన్న సామెతను నిజం చేస్తూ.. నగరాలు.. పట్నాలు.. పల్లెలు.. ఉడికిపోతున్నాయి.

రోజు రోజుకు పెరుగుతూ ఉష్ణోక్షిగతలు శుక్రవారం రికార్డుస్థాయిని చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా మణుగూరు, వరంగల్ జిల్లా చెల్పూరు కేటీపీపీలో 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోక్షిగతలు మంటపుట్టించాయి. బయటికి రాలేక.. లోన ఉక్కపోత భరించలేక.. రాష్ట్రవ్యాప్తంగా నరకం! జూన్ మొదటివారంలో 50డిక్షిగీలు దాటుతుందని అంచనా వేసిన ఉష్ణోక్షిగతలు.. ఇప్పటికే ఆ మార్కు దాటేయడంతో భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు గత వారం రోజులుగా కొనసాగుతున్న హీట్‌వేవ్ పరిస్థితులు మరో రెండు మూడు రోజులు మరింత ఉధృతంగా ఉంటాయన్న వార్తలతో సర్వత్రా కలకలం రేగుతోంది. వడదెబ్బ మృతులకు ఆపద్బంధు పథకం వర్తింపజేస్తామన్న ప్రభుత్వం.. వేసవి మృతుల సంఖ్యను గత కొద్ది రోజుల వ్యవధిలో 26గా లెక్కేసి.. సాయం అందే అవకాశాలను ఉఫ్‌మని ఊదేసింది.

50deg
రోళ్లు పగిలేకాలం.. రోహిణీక్తాలో ఎండాకాలం! వచ్చేసింది. రోహిణిలో రోళ్లు పగులుతాయన్న సామెతను నిజం చేస్తూ.. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకుటున్నాయి. కరీంనగర్‌లో 49 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోక్షిగత నమోదుకాగా.. మణుగూరులో 50 డిగ్రీలుగా మండింది. తెలంగాణ.. కోస్తాంధ్ర.. రాయలసీమ.. ప్రాంతాలకు అతీతం గా ఉడికిపోతున్నాయి. తాళలేని ఎండలతో జనం బెంబేపూత్తిపోతున్నారు. తట్టుకోలేని చిన్నారులు, వృద్ధులు ప్రాణాలొదిలేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ తో 230 మందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్క తెలంగాణ జిల్లాల్లోనే 112 మరణాలు సంభవించాయి. వీరిలో పేదవారు.. కూలిపనులు చేస్తే తప్ప రోజు గడవని కష్టజీవులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా, కోస్తాంవూధలో 4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోక్షిగతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఖమ్మంజిల్లా మణుగూరు సింగరేణి బొగ్గుగనుల ప్రాంతంలో 50 డిగ్రీల సెల్షియస్ గరిష్ఠ ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి. రెంటచింతల, బాపట్ల, రామగుండంలో 47.5 డిగ్రీల ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి.

వారంరోజులుగా రాష్ట్రంలో వీస్తున్న వడగాడ్పుల తీవ్రత మరో రెండు రోజులపాటు కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. తెలంగాణలోని అన్ని ప్రాంతా ల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి. తెలంగాణ అంతటా హీట్‌వేవ్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, మెదక్, హైదరాబాద్‌లతోపాటు సీమాంవూధలోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో శని, ఆదివారాల్లోనూ వడగాడ్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని తెలిపింది. పశ్చిమ, వాయవ్య దిశలనుంచి మధ్యవూపదేశ్, మహారాష్ట్ర మీదుగా తెలంగాణపైకి వీస్తున్న వేడిగాలులతో హీట్ వేవ్ పరిస్థితి తలెత్తింది. జూన్ మొదటి వారానికి 50 డిగ్రీలకు ఉష్ణోక్షిగతలు చేరవచ్చని ముందు అంచనా వేయగా.. ఇప్పటికే ఆ మార్కు దాటిపోతుండటంతో రానున్న రోజులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ రెండో వారంలో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకి అవి రాష్ట్రమంతటా ప్రభావాన్ని చూపేంత వరకు ఉష్ణోక్షిగతల్లో ఆశావహ మార్పులు కష్టమేనని వాతావరణ శాఖ అంటోంది.

50c
కరీంనగర్ జిల్లాలో 27 మంది మృతి
కరీంనగర్ జిల్లాలో శుక్రవారం గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోక్షిగత నమోదైంది. శుక్రవారం 27 మంది చనిపోయారు. వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి. గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీలో 50 డిగ్రీల ఉష్ణోక్షిగత నమోదైంది. జిల్లాలోని నెల్లికుదురు మండలకేంవూదంలో 49.4 డిగ్రీల గరిష్ఠ పగటి ఉష్ణోక్షిగత నమోదయ్యింది. వడగాడ్పులకు తట్టుకోలేక జిల్లావ్యాప్తంగా 23 మంది మృతి చెందారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన విష్ణుచైతన్య చరణ్‌దాస్ (48) ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తూ మరణించడంతో మానుకోటలో మృతదేహాన్ని దింపారు.

నల్లగొండలో శుక్రవారం గరిష్ఠ ఉష్ణోక్షిగత 45.0 డిగ్రీల సెల్షియస్ నమోదు కాగా రాత్రి వరకూ ఎండ వేడిమి తగ్గలేదు. వడదెబ్బకు జిల్లాలో శుక్రవారం 22 మంది మృత్యువాత పడ్డారు. మిర్యాలగూడ మండలం నందిపహాడ్ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ తేజస్విని (3) గురువారం తల్లిదంవూడుల వెంట మోటార్‌సైకిల్‌పై మిర్యాలగూడకు రాగా.. ఎండదెబ్బ తగిలి శుక్రవారం తెల్లవారుజామున చనిపోవడం చూపరులను కలచివేసింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో 13మంది మృతిచెందారు. రంగాడ్డి జిల్లాలో శుక్రవారం గరిష్ఠ ఉష్ణోక్షిగత 43.4, కనిష్ఠ ఉష్ణోక్షిగత 28.5 నమోదుకాగా ఈ ఒక్కరోజే జిల్లాలో వడదెబ్బకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంఖాల్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కామల్ల మల్లయ్య(60) ఐదు రోజుల క్రితం వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా వడదెబ్బ బారిన పడ్డాడు.

స్థానిక ఆస్పవూతిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషాదాన్ని తట్టుకోలేని చిన్న కుమారుడు కామల్ల ధన్‌రాజ్ (18) కూడా చనిపోయాడు. ఒకే రోజు తండ్రి కుమారులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం గరిష్ఠ ఉష్ణోక్షిగత 45.6 కాగా, కనిష్ఠంగా 29.8 డిగ్రీలు నమోదైంది. జిల్లావ్యాప్తంగా వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లాలో శుక్రవారం గరిష్ఠ ఉష్ణోక్షిగత 43.2గా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా నలుగురు చనిపోయా రు. మహబూబ్‌నగర్ జిల్లాలో నలుగురు వడదెబ్బకు మృత్యువాతపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. వడదెబ్బకు గురైన వై ద్యం కోసం వచ్చిన హయత్‌నగర్ మండలం మునుగనూర్ గ్రామానికి చెందిన అనిత(25), ఆమెతోపాటు వచ్చిన రెండేళ్ల వయసున్న కూతురు సునీత మిట్టమధ్యాహ్నపు ఎండలో నడిరోడ్డుపై పడి చనిపోవడం దారినపోయేవారికి కలచివేసింది.

తల్లి రోడ్డుపై పడి చనిపోవడంతో కిందపడిన సునీత.. అప్పటికే అనారోగ్యంతో ఉండటంతో కాసేపటికే కళ్లముందే చనిపోవడంతో పలువురు కంటతడిపెట్టారు. శవాలను తీసుకొని స్వగ్రామానికి వెళ్లేందుకు వెళ్లేందుకు చేతిలో చిల్లగవ్వకూడా లేదని అనిత కుటుంబ సభ్యులకు దారినపోయేవారు తలాకాస్త వేసుకుని రూ.14,600 లు ఇచ్చి పంపారు. మరో ఘటన లో సనత్‌నగర్‌లో ఓ యువకుడు (35) శుక్రవారం మధ్యాహ్నం నడుచుకుంటూ వెళుతూ రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. అతడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది వడదెబ్బతో మృత్యువాత పడ్డారు.
చనిపోయినవారి లో ఖానాపూర్ ఎంపీడీఓ జీ లిం బాద్రి కూడా ఉన్నా రు. తర్లపాడు, సత్తెనపెల్లి గ్రామాల్లో బోర్ల మరమ్మతు, నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా ఆ గ్రామాలకు వెళ్లారు. అక్కడే నీరసించిన ఆయన్ను నిర్మల్ ఏరియా ఆసుపవూతికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

వడదెబ్బ మృతులకు ఆపద్బంధు పథకం రూ.50వేల పరిహారం
వడదెబ్బ మృతులకు ఆపద్బంధు పథకాన్ని వర్తింప చేస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరాడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మండుతున్న ఎండలపై మంత్రి శుక్రవారం సమీక్ష జరిపారు. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్న మంత్రి అక్కడి నుంచే విపత్తు నిర్వహణ కమిషనర్ రాధతో టెలిఫోన్లో మాట్లాడారు. జిల్లా కలెక్టర్లు తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. వడదెబ్బ మృతులకు ఆపద్భంధు పథకం కింద రూ.50వేల పరిహారం అందించాలని చెప్పారు.

రింగ్ ఆఫ్ ఫైర్… కోల్‌బెల్ట్
రెండు రోజులుగా గోదావరి నదీ తీరంలోని కోల్‌బెల్ట్ ప్రాంతమంతా అగ్నిగోళంగా మారింది. గరిష్ఠ ఉష్ణోక్షిగత 50 నుంచి 51 డిగ్రీలకు చేరడంతో ఆదిలాబాద్ జిల్లాలోని తూ ర్పు ప్రాంతమైన ఆసిఫాబాద్ మొదలు బెల్లంపల్లి, గోలేటి, మాదారం, రామక్షికిష్ణాపూర్, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి అటు కరీంనగర్ జిల్లాలోని రామగుండం, గో దావరిఖని, మంథని వరకు, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, ఖమ్మం జిల్లాలోని మణుగూరు, కొత్తగూ డెం, ఇల్లందు ప్రాంతాల జనం సతమతమవుతున్నారు. శుక్రవారం ఉష్ణోక్షిగత అన్ని చోట్ల 50 నుంచి 51 డిగ్రీలుగా నమోదయింది. దీనితో షిప్టుల సమయాన్ని మార్చాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఎండ లు 50 డిగ్రీలు దాటితే ప్రత్యేక వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి. దీనిని సింగరేణి యాజమాన్యమే కాకుండా కోల్‌బెల్ట్‌లోని మిగితా పరిక్షిశమలలోనూ అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. కోల్‌బెల్ట్‌లో ఇప్పటికే 18 మందికిపైగా వడదెబ్బకు మృతి చెందారు.

వడదెబ్బ మరణాలపై సర్కారీ లెక్క 26
-విపత్తు నిర్వహణ కమిషనర్ టీ రాధ
హీట్‌వేవ్ పరిస్థితులు మొదలైన పది పదిహేను రోజుల్లో వడదెబ్బ కారణంగా 26 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విపత్తు నిర్వహణ కమిషనర్ రాధ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోక్షిగతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రం లో నెలకొన్న హీట్ వేవ్ పరిస్థితులు రానున్న రెండు రోజులపాటు కొనసాగుతాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం మెదక్‌లో 12, పశ్చిమ గోదావరిలో 6, నల్లగొండలో 3, చిత్తూరులో 3, తూర్పు గోదావరిలో 1, విశాఖపట్నంలో ఒకరు మృత్యువాత పడినట్లు తెలిపారు. తాజాగా అన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలకు ఉష్ణోక్షిగతలు చేరుకున్నాయని చెప్పారు. మరణాలపై అధికారిక లెక్కల కోసం వేచిచూస్తున్నామని, ఒకవూటెం డు రోజుల్లో పూర్తి వివరాలను పంపాలని కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. వడదెబ్బ మృతుల గుర్తింపుకు మెడికల్ టెస్టు ఫలితాల కోసం జాప్యం జరుగుతోందని, అవి అందగానే జాబితాను సిద్ధం చేస్తారని వెల్లడించారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఉదయం 10నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య బయట తిరగవద్దని సూచించారు.

omlet
నిప్పులు కక్కుతున్న సూర్యుడు
– అల్లాడిపోతున్న ప్రజానీకం
-మరో రెండు రోజులు హీట్‌వేవ్
-వడదెబ్బ మృతులకు ఆపద్బంధు
-సర్కార్ పరిహారం రూ. 50 వేలు
-దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు..
-ఢిల్లీలో 450, అమృత్‌సర్‌లో 47.70
డాబా మీద మిట్టమధ్యాహ్నం పెనంపెట్టి గుడ్డుకొట్టి వేస్తే ఆమ్లెట్ అవుతుందా?.. అవుతుందనడమే కాదు.. వరంగల్ జిల్లా కాజీపేట విష్ణుపురి కాలనీలో శుక్రవారం ఓ గృహిణి మండేఎండలో ఇలా ఆమ్లెట్ వేసి చూపింది.
ఎండలు.. అగ్గిరాజేస్తున్నా యి! దేశ రాజధాని మొదలు.. మారుమూల పల్లెవరకు భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్నాయి! దేశవ్యాప్తంగా చాలా చోట్ల శుక్రవారం 45 డిగ్రీ సెల్షియస్ ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి. ఢిల్లీలో కూడా ఇదేస్థాయిలో ఉష్ణోక్షిగతలు చోటుచేసుకున్నాయి. గురువారం ఏకంగా ఇక్కడ రికార్డు స్థాయిలో 45.7 డిగ్రీ సెల్షియస్ ఉష్ణోక్షిగతలు నమోదైన విషయం తెలిసిందే. ఒడిశాలో శుక్రవారం 47.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోక్షిగతలు నమోదయ్యా యి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 47.7, హర్యానాలోని హిసార్‌లో 47.3 డిగ్రీ సెల్షియస్ ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి.

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 47.4 డిగ్రీలు ఉష్ణోక్షిగతలు చోటుచేసుకున్నాయి. ఉత్తరవూపదేశ్‌లో ఒకవైపు ఎండలు మండుతుండగా.. విద్యుత్ కోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. యూపీలోని బాందాలో 47.4 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోక్షిగతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని విదర్భలో 47 డిగ్రీలు, నాగ్‌పూర్‌లో 46.3 డిగ్రీలు, మధ్యవూపదేశ్‌లోని ఖజురహోలో 46.7 డిగ్రీల ఉష్ణోక్షిగతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, బెం గాల్‌లోనూ ఎండలు నిప్పుల కుం పటిని తలపిస్తున్నాయి. వడగాలు లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8గంటలవరకు వీస్తున్నాయి.

మరిన్నిరోజులు ఇదే పరిస్థితి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మూగజీవాలు కూడా మృత్యువాతపడుతున్నాయి. మధ్యవూపదేశ్‌లోని మొరేనా జిల్లాలో శుక్రవారం 16 నెమళ్లు చనిపోయాయి. ఇక్కడ గురువారం 36 నెమళ్లు మృత్యువాతపడ్డాయి. ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో జమ్ములో వేసవి సెలవులను జూలై 21 వరకు పొడిగించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.