కిరికిరి పెడితే నేను చూస్కుంటా.. మీరు హాయిగా నిద్రపోండి! -కేసీఆర్

ఎవరు ఏ ఏడుపు ఏడ్చినా, ఎంత గగ్గోలు పెట్టినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని టీఆర్‌ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతల బీరాలు చూసి తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, జగన్‌బాబులు అసెంబ్లీకి మోకాళ్ల మీద నడిచొచ్చినా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరన్నారు. టీ బిల్లుపై శాసన సభలో చర్చించినా, చర్చించకపోయినా, యధాతథంగా తిప్పి పంపించినా తెలంగాణ ఏర్పాటుకు ఏం ఫరక్ పడదని అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం 2014 డైరీ, క్యాలెండర్‌తోపాటు తెలంగాణ ప్రొహిబిషన్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం డైరీని కూడా గురువారం గెజిటెడ్ అధికారుల భవనంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంఘం ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ పూర్తయింది, పేపర్ వర్క్ మాత్రమే మిగిలిందని చెప్పారు.
kcrgaruతెలంగాణను ఆపుతానని కిరణ్‌కుమార్‌రెడ్డి కలలు కంటున్నాడని అంటూ …‘నీఅయ్య జుట్టులోంచి మేమొచ్చినం’ అని హెచ్చరించారు. తాజాగా బీజేపీ సీనియర్ నేత అద్వానీ కూడా ఫిబ్రవరిలో బిల్లు వస్తుందని, తాము సంపూర్ణ మద్దతు తెలుపుతామని కుండబద్దలుకొట్టి చెప్పారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తలుచుకున్న తర్వాత ఎవరు ఆపగలరని ప్రశ్నించారు. ఎవంత కిరికిరి చేసినా, ఎంత అరిచి కిరికిరి పెట్టినా ఈ నెల 23 వరకేనన్నారు. వీళ్లతో ఏమీ కూడా కాదు… కడుపు నిండా తిని హాయిగా నిద్రించాలని ఆన్నారు. ‘ఏదైనా అటు ఇటు అయినా మళ్లీ లడాయి అంటే నేను ఉన్నా కదా! ఇంక సచ్చిపోలేదుగదా!’ అని భరోసా ఇచ్చారు.

యుద్ధం చేయాల్సి వస్తే పార్టీలు కాదు.. అందరం కలిసి చేద్దాం. ఎంతదాకంటే అంతదాకే. సహనానికీ హద్దు ఉంటుంది.. అని హెచ్చరించారు. తమిళనాడు నుంచి కొట్లాడి వచ్చిన వాళ్లేమనే విషయం సీమాంధ్రులు గుర్తుంచుకోవాలన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయమే కీలకం అనుకుంటే జన్మలో తమిళనాడు నుంచి బయట పడే వారా అని ప్రశ్నించారు. విభజన ఏవిధంగా చేస్తారు? అడ్డుకొంటా చూస్తా అంటూ బాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘విభజన అయిపోయింది, క్యాదేక్తే… కిదర్ దేక్తే..’ అని ప్రశ్నించారు. రాష్ట్రాల ఏర్పాటు విషయంలో డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ ఆనాడే నిర్ణయం కేంద్రం ఆధీనంలోనే ఉండాలని నిర్ణయించారని కొనియాడారు.‘‘ రాష్ట్రం పరిధిలోనే రాష్ట్ర విభజన అంశం ఉన్నట్లయితే ఉప ప్రాంతానికి అన్యాయం తప్ప న్యాయం జరగదు. అంతర్యుద్ధాలు మొదలవుతాయి, కేంద్రం పరిధిలో ఉంటేనే శ్రేయస్కరం’ అనే ప్రతిపాదన చేశారని చెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడని, తెలంగాణను అడ్డుకునే వారికి భవిష్యత్తులో మంచి సత్కారం చేయాల్సిందేనన్నారు. తెలంగాణ బిల్లును జనవరి 23 తర్వాత రెండు రోజుల్లోపే కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందన్నారు.joythi దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనన్నారు. పార్లమెంటులో సాధారణ మెజార్టీతోనే బిల్లు ఆమోదం పొందుతుందని తేల్చి చెప్పారు. పార్లమెంటు నడవాలంటే కోరం 55 మంది సభ్యులు .. ఏ రోజు బిల్లు ప్రవేశపెడతారో ఆ రోజు పార్లమెంటుకు 55 మంది హాజరై అందులో 28 మంది మద్దతు పలికితే సరిపోతుందని తెలిపారు. ఐతే తాము 33 పార్టీల మద్దతు గతంలోనే కూడగట్టినందున దేశంలో అత్యధిక మెజార్టీతో ఆమోదం పొందిన బిల్లుగా తెలంగాణ బిల్లు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లులో తమకు నష్టం కలిగించే అంశాలను తొలగించేటట్లుగా పోరాడాలని, దాని కోసం ఐక్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలుద్దామని ప్రతిపాదించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో పరమ మూర్ఖ, కిరాతక సీఎంగా నిలిచిపోతాడని హెచ్చరించారు. మంత్రి జానారెడ్డి, టీఆర్‌ఎస్ శాసనసభపక్షనేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, నాయకులంతా సమావేశమై కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. అందరం కలిసి శుక్రవారం మధ్యాహ్నం సమావేశమై తెలంగాణ బిల్లులో తెలంగాణకు నష్టాలు కలిగించే అంశాలను తొలగించాలని కోరుదామని చెప్పారు.
chandra ‘నాకు అర్జంట్ పని ఉండటంతో ఈ సభలో ముందుగా నేను మాట్లాడి వెళ్లిపోదామనుకున్నా, అయితే కేసీఆర్‌కు పని ఉండటంతో ముందుగా మాట్లాడతా అని రిక్వెస్ట్ చేశారు…నేను ఓకే అన్నాను. ఇక్కడినుంచే మా సమన్వయం, పరస్పర సహకారం ప్రారంభమైంది.’ అని సీనియర్ మంత్రి కుందూరు జానారెడ్డి వ్యాఖ్యానించారు.

దీటుగా అడుగులేస్తం: కోదండరాం
సీమాంధ్ర కుట్రల నేతలు వేసే ఆరో అడుగుకు దీటుగా పదకొండో అడుగు సిద్దం చేసుకున్నాం.. సమయం, సందర్భం బట్టి వాటిని ప్రకటిస్తామని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. సీఎండ్రామాలు 23 వరకేనని …ఆ తర్వాత ఆయన ఖేల్ ఖతం..దుకాణం బంద్ అని ఎద్దేవా చేశారు. సమస్యలపై చర్చించేందుకు 7వ తేదీన సంపూర్ణ తెలంగాణ దీక్షను నిర్వహిస్తున్నామన్నారు. సీమాంథ్రులు రాబందులని తెలంగాణ ముసాయిదా బిల్లును చించేసిన రాజ్యాంగ ద్రోహులని లోక్‌సభ డిప్యుటీ చీఫ్‌విప్,ఎంపీ మధుయాష్కీ అన్నారు. సీఎంకు తెలంగాణను అడ్డుకునే అధికారం లేదు… ఆయన అడ్డుకాదు…గడ్డిపోచ… తొలగించడం కాంగ్రెస్‌కు క్షణంలో పని అన్నారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని కాంగ్రెస్ ఎంపీ వివేక్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని కోరితే తన వ్యాపారాలను దెబ్బకొ నోటీసులు జారీ చేశారని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక గంట ఎక్కువగా పనిచేసి పాటుపడాలని ఎమ్మెల్సీ స్వామీగౌడ్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గతంలో ఉల్లంఘనలను చట్టబద్దం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.