కిరికిరి చేస్తే మళ్లీ యుద్ధమే

ఒక్క హక్కు తగ్గినా ఊరుకునే ముచ్చటే లేదు
28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు తెలంగాణకెందుకు?
అధికారాలు లేని రాష్ట్రం కడుక్కతాగడానికా!
జాగ్రత్త..తెలంగాణ ఇప్పుడు మేల్కొన్న బెబ్బులి
ఢిల్లీలో తాడోపేడో తేలుస్తాం
కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ అధినేత స్పష్టీకరణ
ముఖ్యమంవూతిది మూర్ఖపు వాదన
దోపిడీ జలాలకు హక్కులడుగుతున్నాడు
పైస ఇవ్వనన్నోడు.. సమైక్యవాదా?
విభజన ఇష్టంలేకపోతే తప్పుకో!
సీఎంపై నిప్పులు చెరిగిన కేసీఆర్
దేశంలోని 28 రాష్ట్రాలకు ఏ హక్కులైతే ఉన్నాయో.. వాటిలో ఏ ఒక్కటి తగ్గినా అలాంటి రాష్ట్రానికి ఒప్పుకునే ముచ్చటే లేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పది జిల్లాల ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణకు మాత్రమే అంగీకరిస్తామని, కేంద్రం లేని పోని పెత్తనం చేస్తానంటే కుదరదుగాక కుదరదని కుండబద్దలు కొట్టారు. ఇలాగే లేనిపోని కిరికిరీలు పెడితే మరో యుద్ధాన్ని చవిచూడవల్సి వస్తుందని కేంద్రాన్ని తీవ్రంగా హెచ్చరించారు.
kcr

అన్ని అధికారాలు లాగేసుకుని ఇచ్చే రాష్ట్రం ఎందుకు? కడుక్కతాగడానికా? అని నిలదీశారు. 12న ఢిల్లీకి వెళుతున్నానని, తాడోపేడో తేల్చుకుంటానని ఆయన యుద్ధ ప్రకటన చేశారు. వెయ్యి మంది బిడ్డల బలిదానాలు వృథా కానిచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు. నాలుగున్నర కోట్ల ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు పోరు సాగుతుంది. అవసరమైతే మరో యుద్ధానికి తలపడుతాం తప్ప రాజీపడే ప్రసక్తి ఉండదని చెప్పారు. శనివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు వివాహ వేడుకలకు హాజరైన కేసీఆర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటిలో కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి చేస్తున్న వాదనలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన నదీ జలాల దోపిడీని శాశ్వతం చేయాలని వాదిస్తున్నాడని అన్నారు. ‘ఒకనాటి అమాయక తెలంగాణ కాదు.. ఇది బెబ్బులి. ఏమాత్రం తేడా వచ్చినా పంజా విసురుతుంది తస్మాత్ జాగ్రత్త!’ అంటూ హెచ్చరించారు.

దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 29వ రాష్ట్రం అవుతుంది. దేశంలోని 28 రాష్ట్రాలకు లేని నిబంధనలు ఈ ఒక్కరాష్ట్రానికి ఎందుకు ఉండాలని కేసీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌పై అంక్షలు పెడితే సహించే ప్రశ్నే లేదని చెప్పారు. ఉన్నత విద్య, లా అండ్ ఆర్డర్, రెవెన్యూ ఇవన్నీ కేంద్రం పరిధిలో పెడితే ఇంకెందుకు తెలంగాణ? కడుక్క తాగడానికా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడికెడు మంది సీమాంవూధుల కోసం హైదరాబాద్ శాంతి భద్రతలను కేంద్రం చేతుల్లో పెట్టి తెలంగాణవాళ్లను అవమానిస్తారా అని మండిపడ్డారు. నగరంలో ఉన్న 75 లక్షల్లో 65 లక్షలకుపైగా తెలంగాణ వాళ్లే ఉంటారు. శాంతిభవూదతలను కేంద్రం చేతిలో పెడితే.. మరి ఇక్కడి వాళ్లు ప్రజలు కారా? వీళ్లకు భద్రత ఎవరిస్తారు? అని ప్రశ్నించారు. శాంతిభవూదతలు మంది చేతికి ఇస్తామంటే ఇక్కడి ప్రభుత్వం పనికిమాలిందా? లా అండ్ ఆర్డర్ మెయిం ఇక్కడి ప్రభుత్వానికి చేతకాదా? అని నిలదీశారు. మా తెలంగాణ వాళ్లు ముంబాయి, సూరత్‌లో ఉన్నారు. అక్కడ ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తే వారు ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు. పోలీసుల వేతనాలు ఎవరిస్తారు.. వాళ్ల సర్వీసు..పెన్షన్ ..పదోన్నతులు ఎవరి బాధ్యత? అని ప్రశ్నించారు. విద్య విషయంలో సీమాంవూధకు ఏ ఢోకా లేదని విశ్వవిద్యాలయాలు, మెడికల్ కళాశాలలు తెలంగాణ కంటే సీమాంవూధలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

మరో ఉద్యమం
పదేళ్ల పాటు శాంతిభవూదతలను కేంద్రం చేతిలో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో సమ్మతి తెలిపి వచ్చారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కేంద్రం చేతిలో పెట్టుకొమ్మని చెప్పే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ విషయంచెప్పే ముందు ఉద్యోగ సంఘాలతో ఎమైనా చర్చించారా? అంటూ ప్రశ్నించారు. ఎవరేం చెప్పినా సంపూర్ణ తెలంగాణ సాధించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టంచేసారు. ఏ తెలంగాణ కోసమైతే మా విద్యార్థులు అత్మ బలిదానం చేసుకున్నారో.. అమరులయ్యారో వారి ఆశయం సిద్ధించేవరకు, నాలుగున్నర కోట్ల ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ తెలంగాణ సాధించేవరకు పోరు సాగుతుంది. అవసరమైతే మరో యుద్ధానికి తలపడుతాం తప్ప రాజీపడే పసక్తి ఉండదు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈనెల 12న నేను, కేకే ఢిల్లీ వెళుతున్నాం. ఇదే అంశాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా కేంద్రానికి చెపుతామంటూ స్పష్టంచేసారు.

కిరణ్‌ది మూర్ఖపు వాదన..
ఢిల్లీలో శనివారం ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ట. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో గత 57 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు చెప్పారు. చర్చలు, కమిటీల ముందు కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి పాడిందే పాట పాసుపండ్ల దాసరీ అన్నట్లు అరిగిపోయిన రికార్డునే వినిపిస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ సాక్షిగా సాగుతున్న దోపిడీ విధానాన్ని ఆయన పట్టపగలే నిస్సిగ్గుగా చెపుతున్నారని’ విమర్శించారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు కేటాయించింది 19 టీఎంసీలు కాగా 135 టీఎంసీలు ఏ హక్కుతో తీసుకెళుతున్నావ్ అని ప్రశ్నించారు. హక్కులు, అనుమతులు లేని నాన్‌బేసిన్ ఏరియాకు నీళ్లు తరలించి యధేచ్చగా దోపిడి చేస్తున్నారని విమర్శించారు. ‘తెలంగాణ ఏర్పడితే నీళ్లు రావంటున్నావు ముఖ్యమంత్రి!…. ఏ నీళ్లురావు కేటాయించినా నీళ్లా? లేక అక్రమంగా తరలించే నీళ్లా? ప్రవచనాలు చెప్పడం కాదు.. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు! అని డిమాండ్ చేశారు. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో 24వేల మంది పనిచేస్తున్నందున, వీరిని అంధ్రావూపాంతానికి పంపించాలని 1969లో బ్రహ్మానందడ్డి జీవోనంబర్ 36 ఇచ్చారని, 1985లో ఎన్టీఆర్ హయాంలో 610 జీవోకు విరుద్ధంగా 58,952 మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారని ముగ్గురు ఐఎఎస్‌ల బృందం తెల్చిచెప్పిందని.. నిజంకాదా? అని నిలదీశారు. తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున సాగినప్పడు, సకల జనుల సమ్మెతో జనజీవనం స్థంభించినప్పుడు ఏ ఒక్క ఉద్యమ నాయకుడితోనైనా లేదా ఉద్యోగ సంఘాల నాయకుడితోనైనా మాట్లాడావా? అక్రమంగా ఉన్న ఒక్క ఉద్యోగినైనా తొలగించడానికి ప్రయత్నంచేసావా ముఖ్యమంత్రీ అంటూ ప్రశ్నించారు. శానసభ సాక్షిగా తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వ.. ఏమిచేసుకుంటారో చేస్కో! అని మాట్లాడిన నీకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరే నైతిక హక్కు ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇది నాటి ఎడ్డి తెలంగాణ కాదు.. ఇప్పుడు మేల్కొన్న బొబ్బలి తెలంగాణ ఇది. మా చిరకాల స్పప్నం నెరవేరుతుందన్న ఆశలో తెలంగాణ ప్రజలు సమన్వయం పాటిస్తున్నారని అంత మాత్రాన దానిని అలుసుగా తీసుకోవద్దని, ఏ మాత్రం తేడా వచ్చినా పంజావిసుతుంది తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

కరెంటుపై వగల ప్రేమ ఏలా?
రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంటు కష్టాలు ఉంటాయని ముఖ్యమంత్రి వగల ప్రేమ ఒలకబోస్తున్నారని, దీనికి కారణం మీ సీమాంధ్ర పాలకులు కాదా, మీరు చేసిన దోఖా కాదా? అని ప్రశ్నించారు. మణుగూరులో పెట్టాల్సిన విద్యుత్తు ప్రాజెక్టును విజయవాడకు తరలించుకున్నదెవరని అడిగారు. పవర్ పాలసీ ప్రకారం బొగ్గు ఉన్న చోట ప్రాజెక్టులు పెట్టాలని ఉన్నా రాయలసీమలో ఆర్‌టీపీపీ పెట్టలేదా? అంటూ ప్రశ్నించారు. బొగ్గు ఉన్నచోటే ప్రాజెక్టు పెడితే రెండు రూపాయలకే యూనిట్ ఉత్పత్తి ఆయ్యేది.. ఇపుడు రూ.8 నుంచి 11 పెట్టి ప్రైవేటు వారితో ఓప్పందాలు చేసుకోవాల్సి వస్తున్నదని అన్నారు. జెన్‌కోకు విద్యుత్తు ఉత్పత్తిచేసే సామర్థ్యం ఉన్నా వందల కోట్లు దొబ్బేసి ప్రజలనెత్తిన భారం మోపుతున్నది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఢిల్లీలో మేం నివేదిక ఇచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో 15 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటాం. అప్పటివరకు కేంద్రం వద్ద ఉన్న 4వేల మెగావాట్ల విద్యుత్తును ఇవ్వమని కోరామని చెప్పారు. విభజన జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి అనేవాడు స్టేట్స్‌మెన్‌గా వ్యవహరించాలన్నారు. ఒకవేళ విభజన ఇష్టం లేకపోతే రాజీనామా చేసి తప్పుకోవాలని హెచ్చరించారు. సొంత పార్టీ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూనే పదవి పట్టుకు వేలాడేవాడు మూర్ఖుడు తప్ప మరొకటి కాదన్నారు . వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు బిల్లు ప్రవేశ పెడితే వారి అదృష్టం… లేదంటే వారి ఖర్మ! అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం కొట్లాడుడే అన్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.