కిరణ్ హిట్లర్‌లాగా వ్యవహరిస్తున్నడు:హరీష్

రంగారెడ్డి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హిట్లర్‌లాగా వ్యవహరిస్తున్నాడని చరిత్రలో నియంతలకు పట్టిన గతే కిరణ్‌కు పడుతుందని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం ఉక్కపాదం మోపినా ప్రజలు తెలంగాణ ఉద్యమసత్తా చాటిన్రని హరీష్ పేర్కొన్నారు. ఈ విషయమై తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పదించకపోవడం దుర్మార్గమని తెలిపారు. ప్రజలు స్వచ్చందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారని తెలంగాణ ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేస్తామని అనుకోవడం ప్రభుత్వానిది ముర్ఖత్వమే అవుతుందని, కేంద్రం తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.