కిరణ్ పై మండిపడ్డ దినేష్

మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తాయిత్తు ఎక్కడ కట్టిచ్చుకున్నడో కానీ చాలా ధైర్యంగా మాట్లాడిండు.. తెలంగాణకు తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకొని.. సీఎం ధ్రోహాన్ని కూడా బయటపెట్టిండు.

ముఖ్యమంత్రి కిరణ్ పై మాజీ డీజీపీ  మండిపడ్డరు. తెలంగాణ వస్తే నక్సల్స్ సమస్య వస్తదని మీడియాతో చెప్పమని ఒత్తిడి చేసిన్రు. సీఎంకు భయపడే ప్రసక్తే లేదు. సీఎంను ఎదుర్కొనే సత్తా నాకుంది. ఇది ఎవరి బాబు జాగీర్ కాదు. సీఎంగా కిరణ్  ఫెయిల్యూర్ అయ్యారు. పదవిలో కొనసాగిస్తానని సీఎం చెప్పి నమ్మక ద్రోహం చేసిన్రు. సీఎం తమ్ముడు సంతోష్రెడ్డి భూకబ్జాలను అడ్డుకోవడం వల్లే నన్ను తొలగించారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సుకు అనుమతి ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చిన్రు. ఓ ఐపీఎస్ అధికారిపై  హత్యకేసు నమోదైతే.. తొలగించాలని చెప్పినా సీఎం వినలేదు.  ఎస్పీలు, డీఎస్పీలను బదిలీ వేయాలని నాపై పలుమార్లు ఒత్తిడి తెచ్చారంటూ’ దినేష్ రెడ్డి నిజాలుే వెల్లడించిన్రు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.