ఖమ్మం: కారేపల్లిలో పర్యటనలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరికి తెలంగాణ సెగ తగిలింది. ఇవాళ ఆమె పర్యటనను జైతెలంగాణ నినాదాలతో పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఆమె పయనిస్తున్న వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. రాంరెడ్డి దామోదరరెడ్డి అనుచరులు రేణుక గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.