కారెక్కిన గంగుల

KKCR-టీడీపీ, కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలు అనేకమంది టచ్‌లో ఉన్నారు
-ఎవరిని పడితే వారిని చేర్చుకోం..
-ఉద్యమానికి లాభం చేకూరుతుందనుకుంటేనే చేర్చుకుంటాం
-రాజకీయ శక్తిగా ఎదిగి.. కాంగ్రెస్‌ను దెబ్బకొడదాం
-టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు
-కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యం..
-రాష్ట్రసాధనకే టీడీపీని వీడుతున్నా: గంగుల కమలాకర్

‘సకలజనుల సమ్మెతో చరిత్ర సృష్టించాం. అయినా అధికార కాంగ్రెస్‌లో చలనం రాలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కారుతో చావో.. రేవో తేల్చుకోవాలి. అందుకు అందరు ఏకం కావాల్సిన అవసరమున్నది’ అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ 10 జిల్లాల నుంచి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోమవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి.. టీఆర్‌ఎస్‌లో చేరారు. 13ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్న తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు.. ఆ పార్టీని వీడుతున్నానని కమలాకర్ ప్రకటించారు. అంతకుముందు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ శ్రేణులతో విస్తృత మంతనాలు చేసిన ఆయన సాయంత్రం నాలుగు గంటలకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించి.. అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు బయల్దేరారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో కలకలం రేగింది. అతడికి అడ్డుకట్టవేయడానికి టీడీపీ అధినేతలు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. కాగా, కమలాకర్‌ను చేర్చుకోవద్దంటూ ఆదివారం కేసీఆర్‌ను నారదాసు వర్గం కోరిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సోమవారం నారదాసుతో హైదరాబాద్‌లో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు జరిపారు. తనపై నమ్మకం ఉంచండి.. న్యాయం చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో నారదాసు వెనక్కితగ్గారు. ఇదే తరుణంలో కమలాకర్ టీఆర్‌ఎస్‌లోకి రావడాన్ని అహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కమలాకర్‌కు పూర్తిస్థాయిలో లైన్ క్లియర్ అయింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సకలజనుల సమ్మెలాంటి చారివూతక ఉద్యమాలు జరిగినా కాంగ్రెస్ కదలడం లేదు. ఈ క్రమంలో రాజకీయ శక్తిగా ఎదగడమే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ‘‘కాంక్షిగెస్, టీడీపీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు చాలామంది టచ్‌లో ఉన్నారు. అయితే ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకోం. ఉద్యమానికి లాభం చేకూరుస్తారనుకున్న వారినే టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తాం. ఇదే సందర్భంలో చేరికలతో ఇప్పటివరకు పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం తగ్గకుండా చూస్తాం.

పార్టీ ముఖ్యనాయకులతో చర్చించిన తరువాతే ఇతరులను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ టీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న గంగుల కమలాకర్‌ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ కోసం కమలాకర్ గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ తిరస్కరించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీ నేతలతో చర్చించిన తరువాత కమలాకర్ చేరిక కోసం సభ, సమయం నిర్ణయించుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. సంగాడ్డి ఎమ్మెల్యే జగ్గాడ్డి చేస్తున్న ఆరోపణలకు తాను స్పందించబోనని, అది నా స్థాయి కాదని మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్ బదులిచ్చారు. అనంతరం గంగుల కమలాకర్ మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమని పేర్కొన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఇక్కడికి రాలేదని, నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రమని వెల్లడించారు. కేసీఆర్ అనుమతితో భారీ సభ ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్, పార్టీ అధికార ప్రతినిధి జగదీశ్వర్‌డ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌డ్డి, కరీంనగర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌సింగ్, టీఆర్‌ఎస్‌వీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.

కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యం
కేసీఆర్‌ను కలవడానికి బయల్దేరేముందు గంగుల మీడియాతో మాట్లాడారు. ‘‘రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీని వీడుతున్నందుకు బాధగా ఉంది. ఈరోజు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముఖ్య కారణం నేను మొదటి నుంచి తెలంగాణ వాదిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం నావంతు బాధ్యతను నిర్వహించాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నాను. నాకు ఏ పార్టీమీద గాని, వ్యక్తుల మీదగాని ఎటువంటి కోపం లేదు. నాకు కావాల్సింది నా తెలంగాణ రాష్ట్రం. ఇందుకోసం పోరాడే స్వేచ్ఛ టీఆర్‌ఎస్‌లో ఉంది. తెలంగాణ కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ కాబట్టి అందులో చేరుతున్నాను. ఇంతకు ముందు టీడీపీలో ఉన్నప్పుడు జై తెలంగాణ అన్న వెంటనే కొంత మంది జై సమైక్యాంధ్రా అనడం బాధగా ఉండేది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో పోరాటం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాలక్ష్యం ఒక్కటే తెలంగాణ సాధన కోసం నావంతు పాత్రను పోషించడానికి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా’’ అని వెల్లడించారు.

టీడీపీలో కలకలం..
టీడీపీలో 13 సంవత్సరాలుగా ఉన్న కమలాకర్ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించడంతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. కమలాకర్ ప్రభావం ఇతర ఎమ్మెల్యేలు నాయకులపై పడే అవకాశం ఉందన్న ఆందోళన ఆ పార్టీలో మొదలైంది. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు పత్రికల్లో వార్తలు రావడంతో అతడిని కలిసేందుకు అభిమానాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ ఎత్తున వచ్చారు. ఈమేరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరపారు. పార్టీ వీడడానికి గల కారణాలను వివరించారు. అతడి అభివూపాయానికి మెజార్టీ టీడీపీ నాయకులు మద్దతు పలికి తన వెంట ఉంటామని హామీ ఇవ్వగా.. మరికొంత మంది కొంత గడువు కోరినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కమలాకర్ చేరికతో.. ఆయన వెంట శ్రేణులు భారీగా తరలి రావడానికి ఆస్కారం ఉంది. కరీంనగర్ సింగిల్ విండో చైర్మన్ కేశవడ్డి, దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ మంద రాజమల్లు, మాజీ జెడ్పీటీసీ కాసెట్టి లావణ్య, టీడీపీ నగర అధ్యక్షుడు బత్తుల శ్రీనివాసు, ఇతర జిల్లా, నగర నాయకులు, కౌన్సిలర్లు గుగ్గిళ్ల రమేశ్, ప్రేమ్‌కుమార్, నాంపెల్లి శ్రీనివాసు, ఒంటెల సత్యనారాయణడ్డి, పుట్ట నరేందర్, నల్వాల రవీందర్, తోట రాములు, డిండిగాల మహేశ్, గూడూరి మురళి, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఉద్దీన్‌తోపాటుగా చాలా మంది ఆయన్ను అనుసరించే అవకాశం ఉంది. దీంతో కరీంనగర్‌లో టీడీపీ ఖాళీ ఆయ్యే పరిస్థితి ఉందన్న ఆందోళన ఆపార్టీలో వ్యక్తం అవుతోంది.

మరోవైపు కమలాకర్ చేరికను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు చివరి వరకు ప్రయత్నం చేశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పలుమార్లు కమలాకర్‌కు ఫాన్‌చేసి వారించినట్లు సమాచారం. టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫోన్‌ద్వారా మాట్లాడి.. పార్టీ వీడద్దని కోరినట్లు తెలుస్తున్నది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.