కామయ్య సూత్రాలు

మనం ఆడేది టెన్నిస్‌ కాదు.. క్రికెట్.. ఈ ఆటలో సింగిల్స్ తీస్తే పని నడవదు. ఫోర్లు, సిక్సులు కొట్టాలి. అప్పుడే ఆట బావుంటుంది. జర్నలిజం రెండు రకాలు.. ఒకటి న్యూస్‌ మేకింగ్‌, రెండు న్యూస్ ట్రాకింగ్‌. న్యూస్‌ మేకింగ్‌ మనమే వార్తలను సృష్టించాలి. న్యూస్‌ ట్రాకింగ్ అంటే జరిగేవి చూయించాలి. ఇప్పటి వరకు మీరు సింగిల్సే తీశారు. ఇకనుంచి నా లాగా ఫోర్లు కొట్టాలి.

ఈ సోదేందిరా బాబు అనుకుంటున్నారా? ఇది నా సోది కాదు. హెచ్‌ఎంటీవీలో ఈ మధ్యే జాయిన్ అయిన కామయ్య అలియాస్‌  కామేష్‌ అక్కడి ఉద్యోగులకు చెప్పిన పాఠం ఇది.

దూకుడు సినిమాలో అమ్మాయిలు టూ టైప్స్‌ అని సమంత చెప్పినట్టు.. జర్నలిజం టూ టైప్స్‌ అని కామయ్య  సూత్రాలు చెప్పారట. పండంటి జర్నలిజానికి పలు సూత్రాలను బోధించారట.

ఏంటో ఈ జర్నలిజం జీవితం. అందరూ పాఠాలు చెప్తున్నరని హెచ్‌ఎంటీవీ ఉద్యోగులు నైరాశ్యంలో పడిపోయారు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.