కాగ్, మీడియా, కోర్టుల వల్లే విధాన వైకల్యం – నోరు పారేసుకున్న కేంద్రమంత్రి కపిల్ సిబల్

 

కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబల్ కాగ్, మీడియా, కోర్టులపై అక్కసు వెళ్లగక్కారు. వాటి పాండిత్యం వల్లే విధాన్య వైకల్యం భావన ఏర్పడిందని, ప్రభుత్వం ఎప్పటిలాగే నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ‘‘విధాన స్తంభన సంభవించింది మూడు కారకాల వల్లే- కాగ్, మీడియా, కోర్టుల సంచిత పాండిత్యమే ఇది. ఈ మూడు సంస్థల మధ్య ప్రతీకాత్మక సంబంధం ఉంది. వీటివల్ల తలెత్తిన పరిస్థితి వల్ల రోజువారీ వ్యవహారాలు చూడటం కష్టమైంది. అయినా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం కొనసాగిస్తూనే ఉంది’’ అని ఆయన శనివారమిక్కడ జరిగిన ఎకనామిక్స్ టైమ్స్ అవార్డు ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో విధాన వైకల్యం నెలకొందన్న భావనపై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు భారత్ వృద్ధిరేటును తగ్గించిన నేపథ్యంలో విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రభుత్వ ఆర్థిక విధానాలను విమర్శించిన విషయం తెలిసిందే

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.