కుంభకోణాల కాంగ్రెస్ మరో కుంభకోణం చేసేందుకే ప్యాకేజీ అంటోందని, ప్యాకేజీ నుంచి కూడా కోట్లు దండుకోవడానికేనా ప్యాకేజీ కేటాయించడం అన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీకి ఆపేరు సరిగా లేదని కాంగ్రెస్ చోర్ కమిటీ అంటే బాగుంటుందని తెలిపారు. కాంగ్రెస్ స్కాంగ్రెస్ గా మారిందని అన్నరు
కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇస్తానంటే తెలంగాణ ప్రజలకు ఆమోదం యోగ్యం కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఒకవేళ వాళ్లు ప్యాకేజీ ఇస్తామన్నా తెలంగాణ ప్రజలు తీసుకోరని చెప్పారు. ప్యాకేజీలతో తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందరని తెలిపారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఒక్కటే సమస్యకు శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. ‘మాకు రాష్ట్రం ఇవ్వండి, సీమాంధ్రులకు ప్యాకేజీ ఇవ్వండి’ అని సలహా ఇచ్చారు.