కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేస్తోంది: మోడీ

కాన్పూర్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు చేస్తుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం 100 రోజుల్లో ద్రవోల్బణం అరికడతామని చెప్పి ఇప్పటికీ అరికట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇంకా మోసపోకుండా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని మోడీ పిలుపునిచ్చారు. బొగ్గఫైళ్లే కాదు.. ప్రభుత్వమే మాయమైందన్నారు. ఆహార భద్రత బిల్లు ప్రజల ఆకలి తీర్చదని.. మరింత దారిధ్య్రం ఉంచుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ ఏడాది పాలనలో 5 వేల మంది హత్యకు గురయ్యారని, సామాన్య ప్రజలకు యూపీలో భద్రత కరువైందన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌పార్టీలు ఉత్తర ప్రదేశ్‌ను నాశనం చేశాయని మోడీ తెలిపారు. యూపీఏ సర్కారు చేసిన పనుల గురించి చెప్పకుండా… గుజరాత్ గురించి ఎందుకుమాట్లాడుతోందని ప్రశ్నించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.