కాంగ్రెస్ మెడలు వంచేందుకే చలో అసెంబ్లీ

 

kodhanda
విజయవంతానికి కోదండరాం పిలుపు
జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి
కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర అడ్డాలు.. తెలంగాణ సమస్యలను విస్మరించాయి
అస్తిత్వ రాజకీయం.. అనివార్యం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ మెడలు వంచేలా చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని విజయవంతం చేయాలని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన సత్యాగహ దీక్షను ముగించుకుని బుధవారం తిరిగి హైదరాబాద్ బయల్దేరే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. సంసద్ యాత్ర-సత్యాక్షిగహ దీక్ష విజయవంతమైందని ప్రకటించారు. త్వరలో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్షికమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణకు మద్దతు ఇస్తున్న వివిధ జాతీయ పార్టీల నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. టీ జేఏసీ నేతలు, కార్యకర్తలకు ఢిల్లీ యాత్ర కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని కోదండరాం చెప్పారు. ఈ కార్యక్షికమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తాము చివరిసారిగా కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తుచేశామని అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ వినకుంటే.. గ్రామస్థాయిలో ఆ పార్టీ ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం మాత్ర మే కాదని, ఆధిపత్యానికి, దోపిడీకి వ్యతిరేకంగా కూడా జరుగుతున్న పోరాటమని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు సీమాంధ్ర రాజకీయ వర్గాల అడ్డాలని అభివర్ణించారు. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు.

‘ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించలేక పాలక వర్గాలు విఫలమైనప్పుడు ఆ శూన్యం నుంచి మరో రాజకీయ అస్తిత్వం తయారవుతుంది. అది అనివార్యం’ అన్నారు. అందుకు ప్రపంచంలో అనేక ఉదాహరణలున్నాయని చెప్పా రు. రాష్ట్రంలో టీడీపీ, దేశంలో ఇందిరా కాంగ్రెస్, జనతాదళ్ తదితర పార్టీలు అట్లా ఆవిర్భవించినవేనని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని టీ జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వెయ్యి మంది తెలంగాణ యువత బలిదానాలు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.