కాంగ్రెస్ మంత్రులకు చెక్ పెట్టిన కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ రథసారధులుగా ఎన్నికల యుద్ధ్దాన్ని ముందుకు నడిపించాల్సిన బడానాయకులు గట్టి పోటీనెదుర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా పన్నిన చక్రబంధం వారిని కదలనీయడం లేదు. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌లోని అగ్రనాయకత్వంపై ఆయన గురిపెట్టారు.

అస్త్రశస్ర్తాలను ప్రయోగిస్తున్నారు. దీటైన అభ్యర్థులను రంగంలో దించడమే కాకుండా శత్రు సైన్యంలో బలమైన నాయకులను ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులతో టీఆర్‌ఎస్ అధినేత పన్నుతున్న వ్యూహం కాంగ్రెస్‌లో కీలక బాధ్యులుగా ఉన్నవారికి సంకటంగా మారింది. ఎన్నికలలో తమ సొంత నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలలో అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రచారం నిర్వహించాల్సిన సీనియర్లు తమ సెగ్మెంట్ గీత దాటే పరిస్థితి కనిపించడం లేదు. కాలు కదిపితే కష్టమన్న తీరులో వారు తమ సెగ్మెంట్‌లకు పరిమితమవుతున్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్‌బాబు, జానారెడ్డి, డీకే అరుణ, సీనియర్ నాయకుడు డీ.శ్రీనివాస్ తదితరులు గెలిస్తే చాలు మిగతా ప్రచారం సంగతి తరువాత అన్నట్లు పరిస్థితులు మారాయని రాజకీయ విశ్లేషకులు భిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్‌గాంధీల ప్రచారమే పార్టీని గట్టెక్కిస్తుందన్న నమ్మకం తప్ప తమకు పార్టీ అభ్యర్థులను భుజాన వేసుకునే పరిస్థితి లేదన్న తీరులో వారున్నారు.

ఉత్తమ్‌కు సెంటిమెంట్ దెబ్బ…?

trscongనల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో పోటీ ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది. ఒక వైపు బలమైన నాయకుడు, మరోవైపు త్యాగ నినాదంలో సానుభూతి వెల్లువ. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను టీఆర్‌ఎస్ పోటీలోకి దించడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా మారింది. తనది కన్నీళ్లు,వారిది కాసులు అన్నట్లు శంకరమ్మ చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆలోచింప చేస్తోంది. తెలంగాణ ప్రదేశ్‌కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదట్లో తన గెలుపు సులభమనుకున్నప్పటికీ మారిన పరిస్థితులలో నియోజకవర్గంలోనే విస్తతంగా పర్యటించాల్సిన పరిస్థితి తలెత్తింది. సానుభూతి వెల్లువలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా ఉత్తమ్‌కుమార్ తీవ్రంగా కషిచేస్తున్నారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సి వస్తుంది. సానుభూతికి,త్యాగానికి విరుగుడుగా ఆయన అభివద్ధ్ది మంత్రం పఠిస్తున్నారు.

డీఎస్‌తో బాజిరెడ్డి ఢీ…

trscongనిజామాబాద్ రూరల్ నుంచి పోటీలో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ.శ్రీనివాస్‌కు గట్టిసవాల్ ఎదురవుతోంది. డీ.శ్రీనివాస్ సామాజికవర్గానికే చెందిన మాస్‌లీడర్‌గా పేరొందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను టీఆర్‌ఎస్ చివరి నిమిషంలో రంగంలోకి దించడంతో రాజకీయ సమీకరణలు మారాయి. బాజిరెడ్డి సొంత గ్రామం సిరికొండ ఇదే నియోజకవర్గంలో ఉండటంతో టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. కిందిస్థాయి నుంచి సంబంధాలున్న బాజిరెడ్డి ఇప్పటికే డీ.శ్రీనివాస్‌కు దీటుగా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పోటీ నువ్వా-నేనా అన్నట్లు ఉండటంతో డీఎస్ తన నియోజకవర్గం వదిలి బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

పొన్నాలకు తిప్పలే

trscongకాంగ్రెస్ గెలిస్తే పార్టీ గెలిచినట్లు పార్టీ ఓడితే నేనే ఓడినట్లు ఆ వైఫల్యం తనదే అవుతుందని చెప్పుకుంటున్న టీపీసీసీ చీఫ్ పొన్నాల తన నియోజకవర్గం మినహా మరో నియోజకవర్గంలో ప్రచారం చేసే పరిస్థితి కనిపించడం లేదు. వరంగల్ జనగామ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనకు ప్రత్యర్థిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని టీఆర్‌ఎస్ బరిలో నిలిపింది. స్థానబలం ఉన్న యాదగిరిరెడ్డిని రంగంలోకి దించడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారింది.

శ్రీధర్‌బాబుకు గట్టిపోటీ…

trscongమంథని నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఈ సారి పోటీలో తిప్పలు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లా మంథని నుంచి పోటీ చేస్తున్న శ్రీధర్‌బాబుకు ప్రత్యర్థిగా బలమైన అభ్యర్థి పుట్టమధు ను రంగంలోకి దించింది. ఇప్పటికే వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన శ్రీధర్‌బాబు గత ఎన్నికలలో పీఆర్‌పీ నుంచి పోటీ చేసిన పుట్ట మధు స్వల్ప తేడాతో ఓడిపోయారు. శ్రీధర్‌బాబు అతికష్టంపై బయటపడ్డారు. ఈ సారి టీఆర్‌ఎస్ నుంచి పుట్ట మధు రంగంలోకి దిగడంతో గట్టిపోటీ ఎదురవుతుంది.

జానారెడ్డితో నోముల సై అంటే సై

trscongమాజీ మంత్రి పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డిని కూడా ఇరుకున పెట్టడానికి టీఆర్‌ఎస్ ఆఖరి నిమిషంలో అనూహ్యమైన ఎత్తు వేసింది. సీపీఎం కు చెందిన సీనియర్ నాయకుడు నోముల నర్సింహయ్యను పార్టీలోకి చేర్చుకుని వెంటనే జంగ్‌లోకి దించింది. గతంలో నకిరేకల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి అపార రాజకీయ అనుభవమున్న నోముల జానాను గట్టిగానే ఢీకొంటున్నారు.ఏ ఎన్నికలలోనైనా తనతో పాటు అనుచరగణాన్ని గెలిపించుకోవడానికి ప్రయత్నించే జానా ఈ సారి జిల్లా మొత్తం తిరిగే పరిస్థితి కనిపించడంలేదు.

రాజనర్సింహకు ముందరికాళ్ల బంధం

trscongమెదక్ జిల్లా ఆందోల్ నుంచి పోటీచేస్తున్న మాజీ ఉపముఖ్యమంత్రి,కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహకు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సినీ నటుడు బాబూమోహన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్,టీఆర్‌ఎస్ మధ్యనే ఉంది. టీఆర్‌ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ కాంగ్రెస్‌లో బలమైన నాయకులను తమ వైపుకు తిప్పుకుంటున్నారు.నియోజకవర్గంలో రాజకీయ ప్రాబల్యం కలిగిన టీడీపీ నాయకుడు మాణిక్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన డీసీసీ ఉపాధ్యక్షుడు జైపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్ లో చేరడంతో రాజకీయ సమీకరణల్లో మార్పు వచ్చింది. ఇదే సమయంలో అల్లాదుర్గం మండలంలో పార్టీకి బలమైన శక్తిగా ఉన్న ఎంపీపీ కాశీనాథ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరడం దామోదర శిబిరంలో కలకలం రేపింది. పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో దామోదర అప్రమత్తమై తన నియోజకవర్గం పైన మాత్రమే దష్టి కేంద్రీకరించే పరిస్థితి ఏర్పడింది. ప్రచార కమిటీ చైర్మన్‌గా అన్ని నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించాల్సిన ఆయన తన సెగ్మెంట్ ప్రచారంపైనే సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోంది.

డీకేకు మేనల్లుడి సవాల్

trscongమహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ మంత్రి డీకే అరుణ దగ్గరి బంధువుతోనే గట్టిపోటీ నెదుర్కొంటున్నారు. టీఆర్‌ఎస్ ఈ సారి వ్యూహాత్మకంగా డీకే అరుణ మేనల్లుడు కష్ణమోహన్‌రెడ్డిని రంగంలోకి దించింది, పోటీ తీవ్రంగా ఉండటంతో ఆమె కూడా ఇతర నియోజకవర్గాల వైపు కన్నెత్తిచూడని  పరిస్థితి ఏర్పడింది

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.