కాంగ్రెస్ పార్టీని దోశ పిండిని రుబ్బినట్టు రుబ్బి పెనం మీద కాలుస్తరు-వయలార్ రవి వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్

హైదరాబాద్ : తెలంగాణను దోశతో పోల్చిన కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవిపై టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ, తమ ఆత్మగౌరవాన్ని కించపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలకు మతి భ్రమించి ఉద్యమాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని అనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు తల్చుకుంటే కాంగ్రెస్ పార్టీని దోశ పిండిలాగా రుబ్బి వదిలిపెడుతారని తెలిపారు. వయలార్ రవి వ్యాఖ్యలకు నిరసనగా టీ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వయలార్ వ్యాఖ్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.