కాంగ్రెస్ నెం.1 మోసకారి..సోనియా ‘ఝూట్ లేడీ’

 

nagamanna
‘‘తెలంగాణ విషయంలో కాంగ్రెస్సే నెంబర్ 1 మోసకారి. సోనియాగాంధీ ఝూట్ లేడీ’’ అని నాగర్‌కర్నూల్ శాసనసభ సభ్యుడు, బీజేపీ నేత నాగం జనార్దనడ్డి ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోసమే కాంగ్రెస్ నైజమని విమర్శించారు. ‘‘తెలంగాణ విషయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు.. అది మోసం కాదా.? మాట ఇచ్చి తప్పిన సోనియాగాంధీ ఝూట్ లేడీ కాదా..?’’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తానని ప్రకటించి ఇవ్వని సోనియాగాంధీని విమర్శిస్తే తప్పేంటి..? అని అన్నారు.

‘‘సోనియాను విమర్శిస్తావా.? అంటూ కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణాడ్డి గాండ్రిస్తున్నారు. గండ్రపై ప్రజలు గాండ్రించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’’ అని హెచ్చరించారు. నచ్చని వారిని మంత్రి పదవుల నుంచి తొలగిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. సీబీఐ చార్జిషీటును ఎదుర్కొంటున్నవారిని తొలగించడానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు.
1999లో తెలంగాణ ఏర్పాటును టీడీపీ అడ్డుకోకపోతే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 13 ఏళ్లు పూర్తయ్యేవని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.