కాంగ్రెస్ ను తరిమేస్తాం-ఈటెల

‘నంగనాచి మాటలు చెప్పి ఓట్లతో సీట్లు సంపాదించి,ఆ పలుకుబడితో రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న ఆంధ్రాపార్టీల జెండాలను కూల్చాలి’ అని టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి 90రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ భరతం పడుతామని హెచ్చరించారు. సభలు పెట్టి సంబురాలు జరుపుకోవడం కాదు, సీమాంవూధుల కుట్రలను తిప్పికొట్టి ఇచ్చిన తెలంగాణను సాధించుకోకుంటే పుట్టగతులుండవని టీ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లిలోని చారివూతత్మక బురుజు వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

eetalaతెలంగాణపై లేఖ ఇచ్చి అఖిలపక్ష సమావేశంలో అభ్యంతరం లేదన్న చంద్రబాబు, ఇప్పుడేమో ఆంధ్రాలో చిన్నపిల్లగాడ్ని ఎత్తుకొని తెలంగాణ వస్తే వీడి భవిష్యత్ ఏం కావాలంటూ ఊసర సిగ్గుపడేలా మాట్లాడుతున్నాడని ఈటెల ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌కు రావాలంటే పాస్‌పోర్టు తీసుకోవాలని, రాయలసీమకు చుక్క నీళ్లు రావంటూ వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్ల జెండాలు, గద్దెలు తెలంగాణలో ఎందుకుండాలని ప్రశ్నించారు. ‘లంకలో ఉన్నవాళ్లంతా రాక్షసులే.. సీమాంధ్ర పార్టీలన్నీ సమైక్యాంవూధకు మద్దతిచ్చేవే’ అని కేసీఆర్ ఆనాడే చెబితే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు నిజమవుతోందన్నారు. 1947ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించిందన్నారు.

ఆనాడు విలీనమై ప్రాంతాలున్న పక్క రాష్ట్రాల్లో విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటే సమైక్య రాష్ట్రంలో ఎందుకు జరపడంలేదని ప్రశ్నించారు. ఆనాడు నైజాం సైన్యాన్ని ఎదురించిన బైరాన్‌పల్లి మట్టి అమరుల రక్తంతో తడిసిందని, తన కోసం బతికే మనిషి ఈగతో సమానం..పది మంది కోసం బతికేవారు హిమాలయాల కన్న గొప్పవారని కీర్తిస్తూ బైరాన్‌పల్లి అమరవీరులకు నివాళుర్పించారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ నైజాం ముష్కరులపై తిరుగుబాటు చేసి మెడలు వంచిన వీర బైరాన్‌పల్లి అమరుల స్ఫూర్తితో అవసరమైతే ప్రత్యేక తెలంగాణ కోసం మరోసారి తుపాకీ ఎత్తి పోరాడేందుకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ తీర్మానంపై ఒకవేళ కాంగ్రెస్ వెనక్కిపోతే మరోసారి పోరాటం తప్పదని (ఇఫ్ కాంగ్రెస్ గోస్ బ్యాక్ ఆన్ రిసల్యూషన్.. వీ గో బ్యాక్ టు రెవెల్యూషన్) వ్యాఖ్యానించారు. సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు ముత్తిడ్డి యాదగిరి, డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ పాల్గొన్నారు.

నేలను ముద్దాడి.. నీళ్లను చల్లుకొని నివాళులర్పించిన టీ మహిళా జేఏసీ
నిజాం సర్కారు సైన్యాన్ని ఎదురించి పోరాడిన బైరాన్‌పల్లి సాయుధ పోరాట వీరుల స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ సాధించి విజయాన్ని ముద్దాడాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని తెలంగాణ మహిళా జేఏసీ రాష్ట్ర నాయకురాలు అల్లం పద్మ పిలుపునిచ్చారు. టీ మహిళా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మంగళవారం వీరబైరాన్‌పల్లికి చేరుకుంది. నైజాం సైన్యం తూటాలకు ఎదురొడ్డి, దాడులను తిప్పికొట్టి నేలకొరిగిన బైరాన్‌పల్లి బురుజు వద్ద నేలను ముద్దాడిన అల్లం పద్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనాటి పోరాటఘట్టంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాయుధ పోరాటయోధులను సన్మానించి పాదాభివందనం చేశారు. అక్కడి నీటిని తలపై చల్లుకొని పులకించిపోయారు. ఆమె వెంట మహిళా జేఏసీ ప్రతినిధులు సులోచన, విమల, మేరిమాదిగ, మల్లీశ్వరీ, షనాజ్‌ఫాతిమా, అరుణ, గిరిజ, నవీన, రామలక్ష్మి, రేణుక, వసుధ, మాల తి, శోభ, శీల, శైలజ, స్నేహ ఉన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.