కాంగ్రెస్ నిర్ణయం వెనక్కు తీసుకోం: దిగ్విజయ్

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ అన్నారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ నేతలంతా కట్టుబడి ఉంటామని చెప్పారని దిగ్విజయ్ గుర్తు చేశారు. మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదు, కిరణ్ కుమార్‌రెడ్డి అన్ని ప్రాంతాలకు సీఎంగా వ్యవహరించాలని చెప్పామన్నారు. సీఎం వ్యాఖ్యలను పరిశీలించిన తరువాతే స్పందిస్తానని దిగ్విజయ్ అన్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, బీజేపీ యూటర్న్ తీసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ నిర్ణయం మార్చుకోదని దిగ్విజయ్ స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.