కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వదు: కేకే

మహబూబ్‌నగర్: కాంగ్రెస్‌పార్టీ తెలంగాణను ఇవ్వదని టీఆర్‌ఎస్ నేత కే కేశవరావు అన్నారు.  ‘మనం తెలంగాణను ఇప్పుడే సాధించుకోవాలి. తెలంగాణను ఇప్పుడు సాధించుకోకుంటే ఎప్పటికీ సాధించుకోలేం’ అని కార్యకర్తలకు తెలిపారు. గత యాబై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందని కేకే ధ్వజమెత్తారు. టీడీపీ కూడా ఆంధ్రాపార్టీయేనని ఆయన విమర్శించారు. అందుకే టీడీపీని తెలంగాణ ప్రజలెవరూ విశ్వసించడంలేదని దుయ్యబట్టారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.