కాంగ్రెస్ ఓటమి ఖాయం : నరేంద్ర మోడీ

లక్నో : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కావడం ఖాయమని గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం నుంచి ఉగ్రవాదాన్ని పారదోలుతామని చెప్పారు. ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో యూపీ ప్రభుత్వం బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అన్యాయంగా అరెస్టు చేసిందని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.