కాంగ్రెస్‌ విద్రోహంపై మండిపడ్డ తెలంగాణ

 

kodanda-విద్రోహదినాన తెలంగాణవాదుల నిరసన.. పది జిల్లాల్లో తెలంగాణ వ్యతిరేక పార్టీలపై కన్నెర్ర
-గాంధీభవన్ ముట్టడి.. కోదండరాం సహా 86 మంది అరెస్టు.. విడుదల
-తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన గాంధీభవన్
-లోపలికి చొచ్చుకుని పోయేందుకు విఫలయత్నం
-నాలుగు దఫాలుగా దూసుకొచ్చిన తెలంగాణవాదులు
-గోడ దూకి ప్రవేశించిన మాలమహానాడు కార్యకర్తలు

ఇది తారీఖుల్లో ఓ తారీఖు కాదు. మూడేళ్ల కిందట తెలంగాణ గుండెను కలచివేసిన రోజు. సలుపుతుండే పుండు. డిసెంబర్ 9న ఇస్తున్నామని ప్రకటించిన రాష్ట్రాన్ని మళ్ళీ వెనుకకు తీసుకున్న దినం. ఆ ప్రకటన.. సీమాంధ్ర స్వార్థ పెట్టుబడిదారుల కుటిలత్వానికి, నమ్మించి వంచించిన కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి, కాంగ్రెస్ వంచనకు నిదర్శనం. అందుకే.. తెలంగాణవాదులకు విద్రోహ దినం. విద్రోహానికి మూడేళ్ళయిన సందర్భంగా ఆదివారం తెలంగాణలోని పది జిల్లాలు తమ ధర్మాక్షిగహాన్ని మరోసారి వెల్లడించాయి. జేఏసీ పిలుపు మేరకు రాజధాని నగరం హైదరాబాద్ సహా రంగాడ్డి, మెదక్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలు కదిలిపోయాయి. రకరకాల రూపాల్లో తమ నిరసనను ప్రదర్శించాయి. తెలంగాణకు అనుకూలంగా పార్టీలు ఏకాభివూపాయాన్ని ప్రకటించాలని నినదించాయి. తెలంగాణకు మద్దతుగా టీఆర్‌ఎస్‌తోపాటు పలు పార్టీలు, ప్రజాసంఘాలు ఊరేగింపులు నిర్వహించాయి. ర్యాలీలు, ధర్నాలతో దద్దరిల్లజేశాయి. వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ, సీమాంధ్ర పెట్టుబడిదారుల దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలను ఎగిరేశారు. మానవహారాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో యూపీఏ అధినేత్రి సోనియా, వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంవూధ నేతల దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు ఈ నిరసన కార్యక్షికమాల్లో పాల్గొన్నారు. కొన్నిచోట్ల కాగడాల ప్రదర్శనలు జరిగాయి.

lawyera
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ ప్రాంగణం ఆదివారం మరోసారి తెలంగాణ నినాదాలతో దద్దరిల్లింది. తెలంగాణపై ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో అధికార పార్టీగా ఉన్న కాంక్షిగెస్ తెలంగాణకు అనుకూలంగా, అందరికంటే మొదట తన అభివూపాయం చెప్పాలనే డిమాండ్‌తో తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, టీ న్యాయవాదులు, సామాజిక తెలంగాణ, తెలంగాణ మాలమహానాడు.. తదితర టీ వాదులు గాంధీభవన్ ముట్టడి కార్యవూకమం నిర్వహించారు. తెలంగాణపై సానుకూలంగా చేసిన డిసెంబర్ 9 ప్రకటనను కాదని సీమాంధ్ర రాజకీయ నేతలు, పెట్టుబడిదారుల ఒత్తిడికి తలొగ్గి అందుకు విరుద్ధంగా మరో ప్రకటన చేసిన డిసెంబర్ 23ను జేఏసీ విద్రోహదినంగా పాటిస్తోంది. అందు లో భాగంగానే ఆదివారం టీ జేఏసీ నేతృత్వంలో తెలంగాణవాదులు బృందాలుగా విడిపోయి నాలుగు దఫాల్లో వ్యూహాత్మకంగా గాంధీభవన్‌ను ముట్టడించారు.

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గాంధీభవన్ వద్దకు రాగానే పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. గాంధీభవన్ వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను, పోలీసుల వలయా న్ని ఛేదించుకొని గేట్‌లోకి చొరబడేందుకు ఉద్యమకారులు చేసిన యత్నాలను పోలీసులు నిలువరించారు. దీంతో జై తెలంగాణ నినాదాలు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బిగ్గరగా అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గుంపులుగా వస్తున్నవారిని పోలీసులు అడ్డగించి బలవంతంగా వ్యాన్లలోకి ఈడ్చుకెళ్లి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. అనంతరం వదిలిపెట్టారు. అరెస్టయినవారిలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు, రసమయి బాలకిషన్, సంధ్య, గజ్జెల కాంతం, నాగేశ్వర్‌రావు, గోవర్ధన్‌డ్డి, దిలీప్‌కుమార్, ప్రొఫెసర్ వినోద్‌కుమార్, అద్దంకి దయాకర్, సతీష్ సహా 86 మంది ఉన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారులు డాక్టర్ పీవీ రంగారావు, రాజేశ్వర్‌రావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి డీవీ సత్యనారాయణ మరికొందరు నేతలు గాంధీభవన్‌లో ఉదయం పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం కావడంతో పార్టీ నేతపూవరూ రాలేదు. వారు వెళ్ళిపోగానే పోలీసులు ముందు జాగవూత్తచర్యగా గాంధీభవన్ ప్రధాన గేటును మూసిఉంచారు.

కొద్దిసేపటికే సుమారు 11.30 గంటల ప్రాతంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ధూంధాం నాయకుడు రసమయి బాలకిషన్, ప్రగతిశీల మ హిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యం, ఆ పార్టీ నేత నాగేశ్వర్‌రావు, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకుడు గోవర్ధన్‌డ్డి తదితరు లు సుమారు 40 మంది గాంధీభవన్ పక్కనే పటేల్‌నగర్ వైపు ఉన్న టీఎన్‌జీవో కార్యాలయంవైపు నుంచి నినాదాలు చేస్తూ వచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, పరుగులు తీసి గాంధీభవన్ గేటు వద్దకు చేరుకున్నారు. లోపలికి చొచ్చుకునిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వారందరిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. దాదాపు గంట తర్వాత మరో బృందం గాంధీభవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, తెలంగాణ ప్రజా సంఘాల ఛైర్మన్ గజ్జెల కాంతం, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రొఫెసర్ వినోద్‌కుమార్, టీఆల్డీ నేత, న్యాయవాది శేషగిరిరావు తదితరులతో కలిసి నినాదాలు చేస్తూ గాంధీభవన్‌లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మరో 25 నిమిషాలకు ఓయూ లా కళాశాల విద్యార్థులు, తెలంగాణ సామాజిక జేఏసీ నేత సతీష్ మాదిగ నేతృత్వంలో కొందరు తెలంగాణకు అనుకూలంగా నినాదాలిస్తూ గాంధీభవన్‌గేటు వద్ద దూసుకొచ్చారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి తెలంగాణ మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ నేతృత్వంలో కార్యకర్తలు కొందరు టీఎన్‌జీవో కార్యాలయం వైపు నుంచి నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. సుమారు పదిమంది గాంధీభవన్ ప్రహరీ గోడ ఎక్కి నినాదాలు చేస్తూ లోపలికి దూకారు. అవాక్కైన పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దయాకర్, మరికొందరు కార్యకర్తలు గాంధీభవన్ గేటు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను పోలీసులు బలవంతంగా వ్యాన్లలో నాంపల్లి, ఆబిడ్స్, గాంధీనగర్ పోలీసుస్టేషన్లకు తరలించారు. అరెస్టు అయినవారిలో న్యాయవాదుల జేఏసీ నాయకులు గోవర్ధన్‌డ్డి, రాజేంవూదడ్డి, ఉపేంద్ర, మాలమహానాడు ప్రతినిధులు అద్దంకి దయాకర్, బీ మధు, నరేందర్, గోపాల్, మాధవ్, యాదగిరి, మహిళా నేతలు సంధ్య, ఝాన్సీ, సామాజిక తెలంగాణ నాయకుడు సతీష్ మాదిగ తదితరులున్నారు. రసమయి బాలకిషన్ బృందం కళాకారులు తెలంగాణ ఆవశ్యకత, జరుగుతున్న ఆన్యాయాలు, వివక్షపై ఆటపాటలతో ఉద్యమకారులను ఉత్తేజితం చేశారు.

గాంధీభవన్‌ను కూల్చేస్తాం: అద్దంకి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని, ఆ పార్టీలో ప్రాంతాలవారీగా భిన్నాభివూపాయాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ విమర్శించారు. ఈ నెల 28న జరిగే అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించకపోతే గాంధీభవన్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. అరెస్టు అనంతరం దయాకర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి వల్లనే పరిస్థితి ఇంతవరకొచ్చిందన్నారు.

తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సే: సతీష్ మాదిగ
తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సేనని సామాజిక తెలంగాణ జేఏసీ నాయకుడు సతీష్ మాదిగ అన్నారు. గాంధీభవన్ ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ వివిధ సాకులు చూపిస్తూ తప్పించుకోజూస్తున్నదని మండిపడ్డారు.

మొదట చెప్పాల్సింది కాంగ్రెస్సే: దిలీప్, కాంతం, వినోద్
తెలంగాణపై ఈ నెల 28న నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో అందరికంటే ముందుగా అభివూపాయం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీనేనని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతం, ప్రొఫెసర్ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి తప్పుకోవాలనుకుంటే కుదరదన్నారు.

newdemoటీ మీడియా, నెట్‌వర్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను కేంద్రం డిసెంబరు 23న వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆదివారం తెలంగాణ విద్రోహ దినాన్ని పాటించారు. తెలంగాణవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి నల్లజెండాలు ఎగురవేశారు. అన్ని జిల్లాల్లో నిరసన తెలిపారు. రాజకీయపార్టీలు, విద్యా ర్థి, ప్రజా సంఘాలు ద్రోహంపై మండిపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

నోటికి నల్ల వస్త్రాలతో ర్యాలీ
కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ నల్లజెండా ఎగురవేశారు. జేఏసీ నాయకులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి విఫలయత్నం చేశారు. హుస్నాబాద్ మండలంలో సీపీఐ నాయకులు నల్లజెండాలు ఎగరేశారు. జేఏసీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వరంగల్ అండర్ రైల్వేగేట్ జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులు వీధుల్లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఉర్సులో మానుకోట మహిమగలరాళ్ల గద్దె వద్ద నల్లజెండాలతో టీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలిపారు. కాళోజీ సెంటర్ వద్ద కేయూ జాక్, టీఆర్‌ఎస్వీ, పీడీఎస్‌యూ నాయకులు నల్లజెండాలతో ప్రదర్శన చేశారు.అమరవీరుల స్థూపం వద్ద టీపీఎఫ్, టీఎమ్మార్పీఎస్ నాయకులు భారీ ప్రదర్శన చేపట్టారు. టీఆర్‌ఎస్వీ, లాయర్లు నల్లజెండాలతో ర్యాలీ చేశారు. నర్సంపేటలో జేఏసీ, న్యూడెమోక్షికసీ ర్యాలీ, దుగ్గొండిలో టీఆర్‌ఎస్ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మెదక్ జిల్లావ్యాప్తంగా కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేశారు.సంగాడ్డిలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, పశ్చిమ మండల జేఏసీ నేత అశోక్‌కుమార్ పాల్గొన్నారు. మెదక్‌లో జేఏసీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. నల్లగొండ జిల్లా జేఏసీ చైర్మన్ వెంక బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిడ్డి, టీఆర్‌ఎస్ నేత చకిలం అనిల్‌కుమార్, ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు నిరసనల్లో పాల్గొన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. కొత్తగూడెంలో నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన చేపట్టారు.

నిరసనలతో హోరెత్తిన రాజధాని
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌డ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం, జిల్లా కో కన్వీనర్ బెక్కెం జనార్దన్, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, టీ సీపీఎం నేత ఎస్. ఎం.ఖలీల్, టీఎస్ జేఏసీ, ఏబీవీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. వనపర్తిలో నోటికి నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. రాజధానిలోతెలంగాణవాదులు నల్లదుస్తులు ధరించి నల్లజెండాలను చేబూని సీమాంధ్ర శక్తులపై కన్నెపూరచేశారు. సీమాంధ్ర ద్రోహుల్లారా… ఖబడ్దార్ అని నినదించారు. కూకట్‌పలిల్లో జేఏసీ బైక్‌ర్యాలీ,ముషీరాబాద్ నల్ల జెండాలతో నిరసనచేపట్టారు. ఆదిలాబాద్‌లో సీమాంవూధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే జోగురామన్న, జేఏసీ జిల్లా ఇన్‌చార్జి శంకర్ ముదిరాజ్ బైఠాయించి నిరసన తెలిపారు. కాగజ్‌నగర్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య రాస్తారోకో పాల్గొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై నల్ల జెండాలు ఎగురవేశారు. టీయూలో దిష్టిబొమ్మలను దహనం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.