కాంగ్రెస్‌పార్టీపై నమ్మకం లేదు : కోదండరాం

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌పార్టీని నమ్మేదేలేదని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అంశంపై వివిధ జాతీయ పార్టీల నేతలతో జరిగిన రౌండ్ సమావేశం విజయవంతమైందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో జాతీయ పార్టీల మద్దతు కూడగట్టామన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్‌ను నమ్మగూడదని ఆయన హెచ్చరించారు. ఒత్తిడి తేకపోతే తెలంగాణకు నష్టం జరుగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో జేఏసీ స్టాండ్ మారలేదని వివరించారు. జేఏసీ ఏం మాట్లాడినా తెలంగాణ గురించే మాట్లాడుతుందని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.