కాంగ్రెస్‌ను నమ్మితే మొదటికే మోసం


-తెలంగాణ వచ్చే వరకూ పోరు ఆపొద్దు
-రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి
-టీ కాంగ్రెస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : కోదండరాం
-టీజేఏసీ జన చైతన్య యాత్ర ప్రారంభం
-తాండూరు, వికారాబాద్‌లో అపూర్వ స్పందన
-పెద్ద ఎత్తున సభలకు హాజరైన తెలంగాణవాదులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని టీ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. నాన్చివేత, సాచివేత, దాటవేతలతో సాగదీస్తే తెలంగాణ ప్రజలు పాలకులను సాగనంపుతారని హెచ్చరించారు. వేయిమరణాల గర్భశోకంతో దుఃఖిస్తున్న తెలంగాణ, తెలంగాణ ప్రకటనకోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నదని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు నెగ్గేవరకు ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తూనే ఉంటారని ఆయన సుస్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు పోరాటాన్ని ఆపవద్దని, రాష్ట్ర సాధనకు ఇది కీలక సమయమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీ జేఏసీ జనచైతన్య యాత్రను కోదండరాం ప్రారంభించారు. కార్యక్షికమంలో జేఏసీ నేతలు వీ శ్రీనివాస్‌గౌడ్, సీ విఠల్, అద్దంకి దయాకర్, రాజేందర్‌డ్డి, అయాచితం శ్రీధర్, ఎంబీ కృష్ణయాదవ్, పిట్టల రవీందర్, గొల్లపల్లి నాగరాజు, న్యూడెమొక్షికసీ నేత కే గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దేనని అన్నారు. ఆ బిల్లు ఆమోదం పొందేవరకూ కాంగ్రెస్‌పై ఒత్తిడిని పెంచుతూనే ఉండాలని, ఆ పార్టీని నిలదీయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమని తెలంగాణవాదులకు సూచించారు.

జన చైతన్య యాత్రలలో కాంగ్రెస్ 2001 నుంచి అనుసరిస్తున్న వైఖరినే ప్రచారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఉభయ ప్రాంతాలను రాజకీయ అనిశ్చిత స్థితిలోకి నెట్టి, ఎటూ తేల్చకుండా ఏళ్లుగా సాగదీస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేతలు తెలంగాణపై ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలకు మేలు చేసే గొప్ప అవకాశం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వస్తున్నదని, కేంద్రంలో తెలంగాణపైన ఒత్తిడి పెంచాలని, తెలంగాణ ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు. తెలంగాణ సాధించుకునేవరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలైట్లు విజృంభిస్తారని బూచీ చూపుతున్న సీఎం కిరణ్ ఉభయ ప్రాంతాలకు నేతగా వ్యవహరించడంలేదన్నారు. కాలం చెల్లిన పడికట్టు పదాలతో కేంద్రాన్ని మభ్యపెట్టాలని, ప్రజలను గందరగోళపరిచేందుకు పడరాని పాట్లు పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్(3) ప్రకారం, డిసెంబర్ 9, 2009 ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను కొనసాగిండచం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. సీ విఠల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తాను కోర్ కమిటీలో ఇచ్చిన ప్రజం కాపీలను లీక్‌చేసి తానే పలుచనయ్యారని అన్నారు.

అన్యాయాలు, అక్రమాలు, అధర్మానికి గురైన ప్రజలు ఉద్యమిస్తారన్న చారివూతాత్మక సత్యాన్ని విస్మరించి, తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించొద్దని హితవు పలికారు. ఇక్కడి ప్రజలలో నిబిడీకృతమై ఉన్న శాంతియుత, ప్రజాస్వామిక ఉద్యమ చైతన్యాన్ని సమీకృత చేసేందుకే జనచైతన్య యాత్రలు చేపట్టామన్నారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ జనచైతన్య యాత్రలు 25వతేదీతో ఆగిపోవని, తెలంగాణపై కాంగ్రెస్ తన స్పష్టమైన వైఖరి చెప్పేవరకూ కొనసాగుతూనే ఉంటాయన్నారు. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ప్రజాస్వామిక ఉద్యమాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణ ప్రకటించకుంటే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని కే గోవర్ధన్ హెచ్చరించారు. కాగా, టీ జేఏసీ నిర్ణయించిన ఉద్యమ కార్యాచరణ ప్రకారం శుక్రవారం రంగాడ్డి జిల్లా వికారాబాద్, తాండూర్‌లలో జనచైతన్య యాత్రలు, సదస్సులు జరిగాయి. అయితే తెరపిలేని వర్షాల కారణంగా నిజామాబాద్‌లో జరపనున్న జనచైతన్య యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశామని కోదండరాం తెలిపారు.

తాండూరు, వికారాబాద్‌లో అపూర్వ స్పందన
రంగాడ్డి జిల్లా తాండూరు, వికారాబాద్‌లో టీజేఏసీ శుక్రవారం ప్రారంభించిన జన చైతన్య యాత్రకు అపూర్వ స్పందన లభించింది. తాండూరు కార్యక్షికమంలో పాల్గొన్న కోదండరాం మాట్లాడుతూ.. ఎవరి దయవల్లా తెలంగాణ రావ ఇన్నాళ్లుగా మనం చేసిన పోరాటాల వల్లనే వస్తుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలోని కనీసం లక్ష మంది నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణపై నిర్ణయాన్ని సాగదీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఉద్యోగులు, విద్యార్థులు ఎన్ని త్యాగాలు చేస్తున్నా తెలంగాణకు చెందిన నాయకుల్లో సానుభూతి కనిపించడం లేదని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌డ్డి అన్నారు. కార్యక్షికమంలో జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్, సీ విఠల్, కే శ్రీనివాస్, అద్దంకి దయాకర్, మహిపాల్‌డ్డి, సత్యం, సదానందం, శుభవూపద్‌ప సాంబూరి సోమశేఖర్, ఆర్‌విజయ్‌కుమార్, మదన్‌డ్డి, బైండ్ల విజయ్‌కుమార్, కల్కోడ నర్సింహులు, రామారావుజోషి, మాధు సత్యం, మణిపాల్‌డ్డి, వెంకట్‌డ్డి, బీ శివ,జంగయ్య, డాక్టర్ సబితానంద్, రాంచందర్, విఠల్ తదితరులు పాల్గొన్నర

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.