కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి అవకాశం

 

gfdhg తెలంగాణపై బిల్లు పెట్టకుంటే పుట్టగతులుండవ్
సంసద్ యాత్ర తర్వాత ఉధృత ఉద్యమం.. జాతీయనేతలంతా మద్దతు పలికారు
టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్‌కు ఇదే చివరి అవకాశమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. త్వరలో జరిగే సంసద్ యాత్రకు ముందు తెలంగాణ అంశంపై వివిధ జాతీయ పార్టీల మద్దతు కూడగ టీ జేఏసీ ప్రతినిధి బృందం ఢిల్లీలో ఆది, సోమవారాల్లో పలువురు రాజకీయ నాయకులను కలిసింది. తాము కలిసిన నేతలంతా తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలికారని కోదండరాం చెప్పారు. సంసద్ యాత్ర తర్వాత పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా తెలంగాణ బిల్లు పెట్టని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు కృషి చేయాలని తాము వివిధ పార్టీల జాతీయ నాయకులను కోరినట్లు కోదండరాం తెలిపారు. సోమవారం విజయ్‌చౌక్ వద్ద ఇతర జేఏసీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టనున్న సంసద్‌యావూతను విజయవంతం చేస్తామన్న ధీమాను జేఏసీ నేతలు వ్యక్తం చేశారు. తెలంగాణ వనరులు, నీళ్లు, ఉద్యోగాలు, ఆత్మగౌరవం కొరకు ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారనే విషయాన్ని మరోసారి జాతీయ నేతలకు వివరించామని కోదండరాం తెలిపారు. సంసద్ యాత్ర అనంతరం చలో అసెంబ్లీ కార్యక్షికమం చేపడుతామని కోదండరాం స్పష్టం చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఇక ముందు తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతరూపం దాల్చుతుందని చెప్పారు. సంసద్ యాత్రకు వేల సంఖ్యలో తరలి వచ్చేందుకు జేఏసీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, కానీ.. ఇక్కడ వసతి ఏర్పాట్ల ఇబ్బంది కారణంగా 2వేల మంది మాత్రమే రాగలగుతున్నామని వివరించారు. పార్లమెంటులో తాము కలిసిన పార్టీలన్నీ తెలంగాణను కోరుకుంటున్నాయని జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. తెలంగాణ రాకపోవడం పై జాతీయ నేతలు బాధపడ్డారని తెలిపారు. తెలంగాణ యువత బలిదానాల పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు.

ఏళ్లు గడుస్తున్నా కాంగ్రెస్‌కు తెలంగాణపై స్పష్టత రాకపోవడానికి కారణం ఆ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడమేనని విమర్శించారు. కష్టకాలంలో మభ్యపెట్టడం, అనంతరం దాటవేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. వెయ్యిమంది మరణించినా తెలంగాణ బిల్లు పెట్టకుండా నాటకాలాడుతున్న కాంగ్రెస్‌కు సంసద్ యాత్ర అనంతరం సరియైన రీతిలో ప్రజలు బుద్ధిచెపుతారన్నారు. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేంద్రం అనుసరిస్తున్న దమననీతిని వ్యతిరేకిస్తూ, తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండుతో తాము సంసద్ యాత్రను చేపట్టినట్లు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీవూపసాద్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఇన్నాళ్లుగా మోసం చేస్తూ వస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా స్వరాష్ట్రం ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సంసద్ యాత్రకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టామని దేవీ ప్రసాద్ చెప్పారు.

జాతీయ నేతల మద్దతు
ఈనెల 29 30 తేదీల్లో తెలంగాణ జేఏసీ చేపట్టనున్న సంసద్ యాత్రకు పలు జాతీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. సోమవారం పార్లమెంటు భవనంలో ఆయా పార్టీల నేతలను టీజేఏసీ నేతలు కలిశారు. బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్, శివసేన నేత చంద్ర ప్రకాశ్ ఖైర్, తృణమూల్ కాంగ్రెస్ నేత ముఖుల్ రాజ్, బోడాలండ్ ఎంపీ బిసు ముత్యారి, ఒడిశా రాజ్యసభ సభ్యుడు స్వామి తదితరులను జేఏసీ నాయకులు సంసద్ యాత్ర, ధర్నాకు ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము మొదటినుండి మద్దతునిస్తున్నామని ఇక ముందు కూడా తమ మద్దతు ఉంటుందని ఆయా పార్టీల నేతలు జేఏసీ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ధర్నాకు హాజరవుతామని చెప్పారు. ఈ కార్యక్షికమంలో ఢిల్లీ జేఏసీ నేతలు రామకృష్ణాడ్డి, అజిత్‌డ్డి, బీజేపీ నేత వెదిరె శ్రీ రాం, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నేత రమేశ్ హజారి తదితరులు పాల్గొన్నారు.

సంసద్ యాత్రకు సీపీఐ మద్దతు
సంసద్ యాత్రకు సీపీఐ మద్దతు ప్రకటించింది. పార్టీ కార్యాలయం అజయ్‌భవన్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌డ్డి, సీనియర్ నేత ఏబీ బర్దన్‌ని జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్బంగా వారితో సురవరం మాట్లాడుతూ ఢిల్లీలోజరిగే రెండు రోజుల ధర్నాల తమ పార్టీ పాల్గొంటుందని చెప్పారు. ఇప్పటికైనా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం నవీన్‌చారి ఆత్మబలిదానం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ నమ్మకవూదోహం ఫలితమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంసద్ యాత్రకు తాను స్వయంగా హాజరవుతానని తెలిపారు. సంసద్ యాత్ర ఏర్పాట్లు పూర్తి చేసుకున్న జేఏసీ నేతలు సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.