నటిపై అసభ్యంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్‌ను అరెస్ట్ చేయాలని ఇంఫాల్‌తో పాటు పశ్చిమ, తూర్పు జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగాయి. ఇంఫాల్‌లోని థాంగ్మేబంద్లో ఆందోళనలను కవరేజీ చేసేందుకు ‘ప్రైమ్ టైం’ టీవీ చానల్ వీడియో జర్నలిస్టు నానో సింగ్(29) వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం నిరసనకారులను చెదరగొ పోలీసులు కాల్పులు జరిపారు. వీడియో చిత్రీకరిస్తున్న నానో సింగ్‌కు రెండు బుల్లెట్లు తగిలాయి. ఓ బుల్లెట్ ఛాతిలోకి దూసుకెళ్లడంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. సహచరులు హుటాహుటిన రిజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పవూతికి తరలించగా.. వైద్యులు చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే నానో సింగ్ ప్రాణాలు విడిచాడు. దీంతో ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. మణిపూర్ లోయ, ఇంఫాల్, తూర్పు, పశ్చిమ జిల్లాలు అట్టుడుకుతున్నాయి. పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, నానో సింగ్ నుంచి కెమెరాను బలవంతంగా లాక్కున్నారని తెలిపారు
కవరేజీకి వెళ్తే.. కాల్చి చంపారు!
Posted on December 23, 2012
This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.