కలిసుండే రీతి ఇదేనా ..

కలిసుందామనుకునేటోడు అందరినీ కలుపుకుని పోవాలె.. చేసే సమైక్య ఉద్యమమంటరు.. సోదరుల్లా కలిసుందమని నోటితో చెప్తూనే తెలంగాణవారిపై దాడులకు దిగుతరు.. ఇదేనా కలిసుండే రీతి.. తెలంగాణకు చెందిన ఎస్టీ ఉద్యోగిని బెదరిస్తరా.. చిన్న కార్మికుడిని కొట్టి పైసలు గుంజుకుంటరా?

తెలంగాణ వాడివి.. ఇక్కడికి వచ్చి ఎలా ఉద్యోగం చేస్తున్నావ్.. తక్షణం వెళ్లిపో’ అంటూ తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగినుద్దేశించి సీమాంధ్ర ఎన్జీవోలు హెచ్చరికలు .

గుంటూరులో సాక్షాత్తూ గ్రూప్-1 అధికారి అయిన సాంఘిక సంక్షేమ శాఖలో ఉప సంచాలకుడు హనుమంత నాయక్‌ను ఏపీ ఎన్జీవో ఉద్యోగులు కులం పేరుతో దూషించడం, అదే శాఖలో పనిచేస్తున్న దయానందరాజు అనే వ్యక్తి ఒకడుగు ముందుకేసి వేలెత్తి చూపి మరీ బెదిరించిండు. విశాఖపట్నంలో ఓ కంపెనీలో పనిచేస్తున్న నిజామాబాద్ యువకుడు నవీన్‌పై అక్కడి ‘సమైక్య’ గూండాలు దాడికి దిగి.. . అతని వద్ద నున్న నగదు, సెల్‌ఫోన్, ఏటీఎం కార్డును నిలువుదోపిడీ చేయడంపై తెలంగాణవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

This entry was posted in ARTICLES, Top Stories.

One Response to కలిసుండే రీతి ఇదేనా ..

  1. ramarao jona says:

    yes, really andhra peoples idiots