‘కలిసి ఉండమంటే అప్రజాస్వామికమే అవుతది’-ప్రొ.కోదండరాం

హైదరాబాద్: ఈ రాష్ట్రాన్ని బలవంతంగా కలిసి ఉండమంటే అప్రజాస్వామికమే అవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రం రెండు ముక్కలైందని అనడానికి ఇవాళ్టి రాజమండ్రి జై ఆంధ్రప్రదేశ్ మీటింగే నిదర్శనమని తెలిపారు. తెలంగాణ మంత్రులకు ఆత్మగౌరవం ఉంటే ఇప్పటికైనా తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో కలిసిరావాలని కోరారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారికి సూచించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.