కరీంనగర్‌లో చంద్రబాబుకు తెలంగాణ సెగ

‘వస్తున్న మీకోసం’ పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. గంగాధర మండలం బూర్గుపల్లిలో జైతెలంగాణ నినాదాలు చేస్తూ ఆయన పాదయాత్రను టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పాలంటూ నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు తొత్తులు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు కూడా ప్రతిదాడి చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాబుకు మద్దతుగా పోలీసులు టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన్రు.  .

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.