కమలనాథుడు నరేంద్రుడే!

 

modi– పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం?
– గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఎఫెక్ట్
– ఢిల్లీలో రాజ్‌నాథ్, అద్వానీలతో మోడీ సమావేశం
గుజరాత్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నరేంవూదమోడీ.. ప్రతిపక్షాలనే కాకుండా స్వపక్షంలోని ప్రత్యర్థుల నోళ్లు మూయించారు. ఉప ఎన్నికల్లో ఆరింటికి ఆరు స్థానాల్లో విజయఢంకా మోగించిన మోడీ విజయోత్సాహంతో బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసిన బీజేపీకి గుజరాత్ ఉప ఎన్నికల విజయం ఎంతగానో ఊరటనిచ్చింది. ఇప్పటివరకు మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని వ్యతిరేకించిన వాళ్లు.. ఈ విజయంతో మోడీపై విమర్శలు చేసే ధైర్యం చేయకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మోడీ బీజేపీ ప్రచార సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశముందని అభివూపాయం వ్యక్తమవుతున్నది. కాగా, ఢిల్లీకి వచ్చిన మోడీ మొదట పార్టీ జాతీయా ధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.

ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మోడీని రాజ్‌నాథ్ ప్రశంసించారు. అనంతరం ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగానే తనను ప్రశంసించిన పార్టీ కురువృద్ధుడు అద్వానీని కలిశారు. అంతకుముందు రాజ్‌నాథ్ నివాసం నుంచి బయల్దేరుతూ.. మోడీ ‘అద్వానీని కలిసేందుకు వెళ్తున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, ఇప్పటివరకు అద్వానీ, మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో పార్టీలోని పలువురు నేతలు సైతం ఇదే అభివూపాయాన్ని వ్యక్తం చేశారు. తాజా విజయంతో అద్వానీ, మోడీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. బీజేపీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు అద్వానీ సుముఖత చేయడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అద్వానీ పార్టీలో రెండు ప్రచార కమిటీలు ఏర్పాటుచేయాలని పార్టీని సూచించినట్లు సమాచారం. ఇందులో లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు పర్యవేక్షించేందుకు ఒక కమిటీ, కొద్ది నెలల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను చేప మరో కమిటీ. లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతలు మోడీకి, ఐదు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలు నితిన్ గడ్కరీకి అప్పగించాలని.. ఈమేరకు గోవాలో జరిగే పార్టీ సదస్సులో ఓ ప్రకటన చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. అద్వానీ ప్రకటనపై నితిన్‌గడ్కరీ మాట్లాడుతూ ప్రచార బాధ్యతలపై తనకు ఆసక్తి లేదన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.