కమనీయం.. భద్రకాళి కల్యాణం

భక్తులు కోర్కెలు తీర్చే జగన్మాత భద్రకాళి అమ్మవారికి భద్రేశ్వరస్వామి వారితో కళ్యాణం కమనీయంగా జరిగింది. వరంగల్‌లో భద్రకాళి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం వందలాదిమంది భక్తులు అమ్మవారిని తిలకిస్తుండగా వేదబ్రాహ్మణులు శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. అమ్మవారికి నిత్యాహ్నికం పూర్తిచేసి శంకరాచార్య జయంతిని వేడుకగా జరుపుకున్నారు. అనంతరం చతుస్థానార్చన జరిపి ఉత్సవంగా విద్యబలి పూర్తిచేశారు. ఉదయం అమ్మవారిని దుర్గామాతగా అలంకరించి సింహవాహనంపై ఊరేగించారు. సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. సాయంత్రం కల్యా ణోత్సవాన్ని ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో పార్నంది నర్సింహూర్తి, చెప్పెల వెంకటనాగరాజశర్మ, పాలకుర్తి నర్సింహమూర్తి తదితరులు గణపతి పూజ పుణ్యహవాచనం జరిపి రక్షబంధనం చేశారు. మంగళవాయిద్యాల నడుమ భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణతంతును నయనందకారంగా నిర్వహించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.