కడప గడపకు తరలుతున్న గార్ల గనులు

 

kadapaaతెలంగాణలో సీమాంధ్ర దోపిడీ
వెయ్యి కోట్ల విలువైన ఖనిజం తరలింపు
1/70 చట్టానికి నిలువెల్లా తూట్లు
తవ్వేది గిరిజనుల పేరుతో.. తవ్వించేది సీమాంధ్ర పెద్దలు!
కోట్లు దండుకుంటున్న కడప నేతలు
దగాపడుతున్న ఖమ్మం గనులు.. పట్టించుకోని వలస పాలకులు

ఒక చోట తవ్వుతూ.. మరో చోట తవ్వినట్లు రికార్డులు సృష్టించి.. కొందరు ఘనులు సర్కారును బహిరంగంగానే బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి కడప నేతలు ఇప్పటిదాకా తరలించుకుపోయిన బెరైటీస్ ఖనిజం విలువ వెయ్యి కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా! ఈ విషయంలో పలుమార్లు వివాదాలు తలెత్తినా..

కోర్టుల దాకా వ్యవహారం వెళ్లినా.. ఇప్పటికీ తెలంగాణ వనరు దోపిడీకి గురవుతూనే ఉండటం విశేషం! ఈ తవ్వకాల వెనుక కడప జిల్లా కాంగ్రెస్ నేత కందుల రాజమోహన్‌డ్డి బంధువులు వీరశివాడ్డి, శంకర్‌డ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌డ్డికి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంవూదనాథ్‌డ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే జిల్లాకు చెందిన మరో నేత కూడా బినామీగా ఉండి బెరైటీస్‌ను తరలించేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా గార్ల మండలం బెరైటీస్ గనులకు కొలువైంది. అపారమైన గనులు ఉండటంతో వీటిపై కన్నేసిన కడప పెద్దలు.. మండల పరిధిలోని పోచారం, శేరిపురం గుట్టల్లో బెరైటీస్‌ను అక్రమంగా తవ్వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడి గిరిజన గ్రామాలైన పోచారం, శేరిపురం, నగరం, బట్టుతండా, ముత్తితండా, కోట్యానాయక్ తండా, బాలాజీ తండాలలోని బెరైటీస్ క్వారీలను ఏర్పాటుచేసి కోట్ల రూపాయలు విలువచేసే ఖనిజాన్ని కొల్లడొడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

తరలిస్తున్న కంపెనీలివే..
పై గ్రామాలల్లోని 76, 77/1 సర్వే నంబర్లలో 300 ఎకరాలను కడప కాంగ్రెస్ పార్టీ నాయకుడు కందుల రాజమోహనడ్డి బంధువు ఎస్వీ శివాడ్డిదిగా చెబుతున్న విశ్వభారతి మైనింగ్ కంపెనీ తోడేస్తోంది. మరో 300 ఎకరాలను ఆయన సమీప బంధువు శంకర్‌డ్డిదిగా చెబుతున్న ఇండియన్ మైనింగ్‌కంపెనీ తవ్వేస్తున్నది. 1/70 ప్రాంతం కావడంతో ఇక్కడ గిరిజనేతరులు తవ్వకాలు చేపట్టడం చట్టవ్యతిరేకం. అందులోనూ ఘరానా మోసానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కంపెనీలు తవ్వేది గార్ల మండలం శేరిపురం గుట్టల్లో! కానీ.. రికార్డుల్లో చూపేది మాత్రం కొత్తగూడెం మండలం సిరిపురం! అదేవిధంగా పోచారం సమీపంలోని 57, 58 సర్వే నంబర్లలోని 63 ఎకరాల్లో కడప మాజీ మేయర్ రవీంవూదనాథ్‌డ్డికి బినామీగా ఆరోపణలు ఉన్న జయరాజు పేరిట నడుస్తున్న లక్ష్మీలేబర్ సొసైటీ, ఇవే సర్వేలో నంబర్లలో మరో 55 ఎకరాలను మరో కడపనేత బినామీకి చెందిన కంపెనీ తవ్వేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

పేరుకు గిరిజనులే యాజమానులు!: వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారం ఇక్కడ గిరజనేతరులు తవ్వకాలు చేపట్టడం చట్ట వ్యతిరేకం కావడంతో సదరు సొసైటీలకు గిరిజనులను తమ బినామీలుగా పెట్టుకుని.. వారినే యజమానులుగా చూపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో బినామీ వ్యవహారాలు నడుస్తున్నాయని చెబుతున్నారు. పోనీ యజమానులుగా ఉన్న గిరిజనులకు ఆస్తులేమైనా వచ్చాయా? అంటే ఇప్పటికీ వారికి సొంత ఇల్లు కూడా లేకపోవడం చూస్తే దోపిడీ ఎంత స్థాయిలో కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చని పలువురు అంటున్నారు. నిజానికి యజమానులుగా చెబుతున్న వారు.. సీమాంధ్ర నేతలకు గుమస్తాలుగా, కూలీలుగా జీవనం గడుపుతున్నారు. రోజుకు రూ.200లు కూలి డబ్బులు ఇస్తూ సరిపెడుతున్నారని అంటున్నారు.

కోర్టులకు చేరిన ‘సిరిపురం’-‘శేరిపురం’: రెవెన్యూ రికార్డుల్లో శేరిపురాన్ని సిరిపురం గ్రామంగా చూపుతున్న వైనం కోర్టు దృష్టికి వెళ్లింది. దీనిపై 2009జూన్ 15న ఇల్లెందు ఏస్‌డీఎఫ్‌వో 77/09/ఎస్‌డీఎఫ్/వైఎల్‌డీ ద్వారా మైనింగ్ లీజుదారులకు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ కొందరు అధికారులకు తాయిలాలు చూపి, లీజును రద్దు చేయించి అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోణలున్నాయి. దీనికి ముందే 1996 ఏప్రిల్‌లో సర్వేలాండ్ అండ్ రికార్డుకు చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, గార్ల తహసీల్దార్ ఉమ్మడి సర్వే నిర్వహించి, దీనిని వివాదాస్పద ప్రాంతంగా నిర్థారించారు. ఇదే సంవత్సరం డిసెంబర్ 12న ఈ ప్రాంతం రిజర్వు ఫారెస్టుకు చెందిందని, తవ్వకాలను తక్షణమే ఆపాలని లీజుదారులను సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. 1998జూలై 18న ఈ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. లీజుదారులకు వ్యతిరేకంగా ఇన్ని ఆదేశాలు వచ్చినప్పటికీ అవన్నీ బేఖాతరయ్యాయి.

పోచారం భూములదీ అదే పరిస్థితి..: పోచారం గ్రామంలోని సర్వే నంబర్ 57,58ల్లో 22హెక్టార్లను మెస్సర్స్ లక్ష్మీ ఎస్పీ మైనింగ్ అండ్ లీజింగ్ లేబర్ కాంట్రాక్టు కో-ఆపరేటివ్ సొసైటీకి అప్పగిస్తూ ప్రభుత్వం 2005లో జీవో ఇచ్చింది. ఇదే ప్రాంతంలో పోడు భూమి సాగు పేరుతో 250 ఎకరాలను గిరిజనుల పేరిట ఇచ్చింది. పట్టాలు తీసుకున్న గిరిజనులు కొందరు సాగు చేసుకుంటుండగా.. లీజుదారులు అడ్డుకొని, భయవూభాంతులకు గురిచేశారన్న విమర్శలున్నాయి. అయినా అధికారుపూవరూ పట్టించుకోలేదని ఆనాడు బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1963నుంచి తెలంగాణ ఖనిజాన్ని యథేచ్ఛగా దోచుకుపోతున్న సీమాంధ్ర దొరలు ఇప్పటి వరకూ రూ.1000కోట్ల విలువగల ఖనిజాన్ని తరలించినట్లు అంచనా.

కూలీల ప్రాణాలతో చెలగాటం..: క్వారీల్లో పనిచేసే వ్యక్తులు నిబంధనల ప్రకారం శిక్షణ పొంది ఉండాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా అమాయక గిరిజనులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే క్వారీల్లోకి దించి.. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. క్రేన్లకు ఇనుప బకెట్లను అమర్చి, భూగర్భం నుంచి ఖనిజాన్ని తీస్తున్నారు. వందల అడుగుల లోతున్న గుహల్లో పైకప్పులకు ఎలాంటి ఆధారమూ లేకుండా పనిచేయిస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఖనిజాన్ని తరలిస్తున్న సీమాంవూధులు ఆయా ప్రాంతాల్లో కనీసం సరైన రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడం వారి ధనదాహానికి అద్దం పడుతోందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీలకు రాయల్టీ కూడా చెల్లించ ఫలితంగా తెలంగాణ ప్రాంతాలు బొందలుగా మారుతుండగా.. సీమాంవూధుల ఇళ్లల్లో సిరులు నిండుతున్నాయని స్థానికులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వీరి అక్రమాలకు కళ్లెం వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.