కట్జూ వ్యాఖ్యలపై టీ జేఏసీ, టీఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ భారత ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కేండయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై టీ జేఏసీ, టీఆర్ఎస్ భగ్గుమంది. కట్జూ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. కట్జూ భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. వెయ్యిమంది బలిదానాలు కట్జూకు కనబడలేదా అని ప్రశ్నించారు. అటు  కట్జూ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌కు అంగీకరిస్తే దేశంలో మరిన్ని రాష్ట్రాల కోసం డిమాండ్లు వస్తాయన్న కట్జూ వ్యాఖ్యలపై మాజీ ఎంపీ వినోద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కట్జూ తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి మీడియాను లొంగదీసుకోండని శ్రీకృష్ణ కమిటీ చెప్పినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఏమి చేసిందని ప్రశ్నించారు. ప్రెస్ కౌన్సిల్ చైర్మన్‌గా కట్జూ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.