కంచుకంఠం పద్మావతి సొంతం

పోరుతెలంగాణ తరపున అందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు……………….

ఈ అక్కపేరు పద్మావతి.. ఈ అక్క తెలంగాణ పాట పాడితే సభలో ఉన్నోళ్లు కూడా ఉత్సాహంతో ఎగిరిదునుకుతరు.

కంచుకంఠం పద్మావతి సొంతం.. పుట్టింది హుజూరాబాద్ తాలూకా కమలాపూర్‌లోని కానిపర్తి గ్రామం. మామిళ్ల మల్లయ్య, శ్యామల పెద్దబిడ్డ. నిరుపేద కుటుంబం. బతుకుదెరువుకోసం గోదావరిఖని వెళ్లాడు మల్లయ్య. అక్కడే హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. పనిలో కష్టాన్ని మరిచే పాటను ఆయన మరవలేదు. ఇంట్లో చిన్నచిన్న పాటలు పాడుకునేవాడు. ఆ లక్షణం అతని పెద్ద కూతురు పద్మావతికి అబ్బింది. తనలాగే బిడ్డా ఏదో లల్లాయి పాటలు పాడుతుందిలే అనుకున్నాడు కానీ… ఆమె కంచుకంఠం బతుకమ్మలో ఓ పువ్వులా… చిత్తుచిత్తుల బొమ్మగా మోగుతుందనుకోలేదు. పద్మావతి చదివింది… గోదావరిఖని సిద్దార్థ స్కూల్. చిన్నతనంనుంచే దేశభక్తి గేయాలు, జానపద పాటలు బాగా పాడేది. ఆమె కంఠంలోని మాధుర్యాన్ని గుర్తించాడు ఆ స్కూల్ టీచర్ విజయానంద్. అలా ఆయన గుర్తించగలిగే శక్తి ఆయనకు రక్తంలోనే ఉంది(‘తలాపున పారుతుంది గోదారి… నీ చేను, నీ చెలకా ఎడారీ’ సృష్టికర్త, తనతండ్రి సదాశివుడుతో వచ్చింది). అందుకే ఆమెను కేవలం జానపద గేయాలకే పరిమితం చేయలేదు. తెలంగాణ ఉద్యమ గొంతుకనిచ్చాడు.

బతుకమ్మ… పూల జాతర! ఏ పువ్వు ప్రత్యేకత ఆ పువ్వుది!తొలిదశ తెలంగాణ ఉద్యమం ఎందరో విప్లవకారులను తయారు చేస్తే మలిదశ ఉద్యమం అనేకమంది గాయకులను అందించింది
ఇందులోనూ ఎవరి ప్రత్యేకత వారిది అలా ఉద్భవించిన కలువే కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మామిళ్ల పద్మావతి… ‘మీ త్యాగాల తెలంగాణ జెండా ఎత్తుకున్నమో…’ అంటూ తన కంచుకం
ఉద్యమస్ఫూర్తిని కొనసాగిస్తున్నది… ‘చిత్తుచిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ’ బతుకమ్మ పాటగా ఎందరి నోళ్లలోనో నానుతున్నది మొబైల్‌లో రింగ్‌టోన్‌గా మోగుతున్నది.

ఏడో తరగతిలో
‘రేలాదూలా తాలెళ్లాడే నేలా నా తెలంగాణ…’ పాటతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది పద్మ. మొట్టమొదటి ‘ధూంధాం’ కార్యక్షికమం ఆదిలాబాద్ జిల్లాలో. అది గద్దర్ కార్యక్షికమం. రమ్మని పద్మకు పిలుపు అందింది. కానీ అక్కడికి పోవడానికి పైసలు లేవు. బిడ్డకోసం కమ్మలు కుదువబెట్టి డబ్బులు తెచ్చిచ్చింది శ్యామల. ఆ గండం గట్టెక్కింది. టెన్త్ బోర్డు ఎగ్జామ్స్. తెల్లారితే లెక్కల పరీక్ష. మరోవైపు తొర్రూరులో కేసీఆర్ కార్యక్షికమం ఉంది. కచ్చితంగా రావాలని కబురొచ్చింది. ఏదయితే అదయ్యిందని వెళ్లింది పద్మావతి. తిరిగి బయల్దేరి వచ్చేసరికి ఉదయం 8 గంటలు. ఇంకో రెండు గంటల్లో పరీక్ష. టెన్షన్. రాయగలుగుతనా లేదా అన్న భయం. పాసవుతనా, ఫేలయితనా అని భయం. రిజల్ట్స్ రోజు భయం. కానీ ఎక్కడో ఓ నమ్మకం ఉంది. కచ్చితంగా పాసవుత అని. 75 పర్సెం వచ్చింది. ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఆ చిన్న మెదడుకు ఓ వైపు పాటలు, మరోవైపు పరీక్షలు ఎలా సాధ్యమయ్యిందంటే… ‘టీచర్లు, దోస్తుల చలవే!’ అంటుంది పద్మ.

జనం దగ్గరికి వెళ్లింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్లకు చెప్పడం, రాష్ట్రం ఆవశ్యకతను వివరించడం. అసలే ఉపాధి హామీ పని మండుటెండల్లో. ఉదయం కొన్నిగంటలు, సాయంత్రం కొన్నిగంటలే చేస్తారు. ఉదయం, సాయంత్రం వాళ్ల పని పూర్తి అయి ఇళ్లకు బయలుదేరేందుకు గుమిగూడగానే తన పాటలందుకునేది. ఆ కష్టం ఊరికే పోలేదు. ఆమె పాట తెలంగాణ వ్యాప్తం అయ్యింది. ఈ క్రమంలో ఆమెకు సహాయ సహకారాలు అందించినవావ్లూందరో! టెన్త్ అయిపోవడంతో ఇంటర్‌కి బిడ్డను జమ్మికుంటకు తీసుకొచ్చాడు మల్లయ్య. జమ్మికుంట కాకతీయ కాలేజీలో ఇంటర్ చదువుతోపాటు పాటలు పాడుతూనే ఉంది. ఎక్కడ ధూంధాం జరిగినా వెళ్లేది. ఆ కార్యక్షికమానికి పదిమంది వచ్చిండ్రా, వేయి మంది వచ్చిండ్రా అని చూడలేదు. చిన్న వేదిక, పెద్ద వేదిక అని బేరీజు వేసుకోలేదు. పాడుతూనే ఉంది. ఇన్నేళ్లలో ఎక్కడా ఒక్క ధూంధాం కార్యక్షికమాన్ని మిస్ చేయలేదు. అట్లా దయానర్సింగ్ రాసిన ‘వీరులారా వందనం…’ సీడీకోసం పాడిన మొదటి పాట. తరువాత బతుకమ్మ జాతర సీడీలో ‘చిత్తుచిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ’ అంటూ తన కంచుకంఠాన్ని వినిపించింది. ‘రాలిన రత్నాలు’ అనే సోలో సీడీ చేసింది. ‘విద్యార్థి గర్జన, అగ్గిరవ్వలు, తెలంగాణ కొల ఇలా అనేక ఆల్బమ్స్‌కి తన గొంతునందించింది. ‘గరిటెడైనా చాలు గంగిగోగు పాలు’ అన్న చందంగా… ఆమె పాడింది పది పాటలే. పద్మావతి పేరును తెలంగాణ అంతటా మారుమోగించాయి. అక్క బాటనే పద్మ చెల్లె మౌనిక కూడా పట్టింది. కాకతీయ కాలేజ్‌లోనే పద్మావతి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, మౌనిక మొదటి సంవత్సరం చదువుతున్నది!

వలసలు ఆపేందుకు…
తెలంగాణ బిడ్డలందరూ ఉపాధికోసం దుబాయ్ పోతున్నరు. ఇక కరీంనగర్ జిల్లా నుంచైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బతుకుదెరువుకోసం అక్కడికి వెళ్లి నానా కష్టాలు పడుతున్నరు. చనిపోయి శవాలై వస్తున్నరు. భార్య, పిల్లలను అనాథలను చేస్తున్నరు. ఈ వలసలు వద్దని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేసింది పద్మ. ‘చేసే కష్టమేదో ఇక్కడే చేసుకుని, కుటుంబంతో ఉండి కలో గంజో తాగుదాం…’ అని వాళ్ల మనసు కరిగేలా చేసింది. చాలా మంది క్యాన్సిల్ చేసుకున్నరు. అలా క్యాన్సిల్ చేసుకున్నవాళ్లలో పద్మావతి వాళ్ల నాన్న మల్లయ్య కూడా ఒకడు. కొడుకు పెళ్లయ్యింది. వేరే ఉంటున్నడు. ‘బిడ్డలిద్దరి పెండ్లిళ్లు చేయాల్నంటే… ఈ హమాలీ పనితో కష్టం!’ అనుకొని, దుబాయ్ పయనమవ్వడానికి నిర్ణయించుకున్నడు. వీసా కూడా తయారు చేసుకున్నడు. చివరకు బిడ్డ పాటలు ఆయన మనసునూ కదిలించినయి. ‘కష్టమో, సుఖమో కలిసే అనుభవిద్దాం. నా బిడ్డలే నా ఆస్తులు!’ అని వెనక్కి తగ్గాడు. హీరోయిన్ల వెంటనే తల్లో, తండ్రో ఉండటం చూస్తాం. కానీ అంతకంటే ఎక్కువగా ఓవైపు తను కష్టం చేస్తూనే, మరోవైపు బిడ్డలు ఏ కార్యక్షికమానికి పోవాలన్నా దగ్గరుండి తీసుకపోతడు మల్లయ్య. ‘ఇంత శ్రమ ఎందుకు?’ అంటే… ‘ఉద్యమంలో మా వంతు పాత్ర!’ అని వినవూమంగా చెప్తాడు.

సమాజానికి ఉపయోగపడేలా…
‘అమ్మనాన్న ఇద్దరూ చదువుకోలేదు. కానీ చెల్లి, నాకోసం చాలా కష్టపడ్డారు. ఎన్నిజన్మపూత్తినా వాళ్ల రుణం తీర్చుకోలేను. ఈటెల రాజేందర్ అంకుల్, కళాకారులు, ఎందరో పెద్దలు నాకు వెన్నుదన్నుగా ఉన్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. ఓరోజు హుజూరాబాద్‌లో సభ. అప్పటిదాకా పాటలు పాడిపాడి అప్పుడే స్టేజీ దిగి వెనకకు పోయిన. అప్పుడే కేసీఆర్ సార్ వచ్చిండు. స్టేజీ నిండిపోయింది. వెనుకనుంచి ముందుకెళ్లడమంటే సాహసమే. అలాంటి సమయంలో నా పాటలు అంతకుముందే విన్న కేసీఆర్‌గారు ‘హుజూరాబాద్‌లో ఓ అమ్మాయి తెలంగాణ పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నది. ఆ అమ్మాయి వేదిక మీదికి రావాలే!’ అనంగనే నేను స్టన్నయిపోయిన. దగ్గరికి పోంగనే ‘రా బిడ్డ రా.. నీ అసొంటి బిడ్డలే కావాలి ఇప్పుడు తెలంగాణకి’ అని నా నెత్తిమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించిండ్రు. ఆయనకు నా పేరు తెలియదు. కానీ నా గొంతు గుర్తుంది. కళాకారిణిగా నాకు అంతకన్నా ఏం అవసరం లేదు. తెలంగాణ, ఆడపిల్లల, సామాజిక సమస్యలు ఇలా ఏవైనా కావచ్చు.. సమాజానికి ఉపయోగపడే ఏ అంశం పైనయినా పాటలు పాడుతూనే ఉంటా!’ అంటూ ధీమాగా చెబుతున్నది పద్మావతి.

This entry was posted in ARTICLES, Top Stories.

One Response to కంచుకంఠం పద్మావతి సొంతం