మాంగే ఏంట్రా మైండ్ లెస్ ఫెలో..

తబశుభ ఆగే జాకే ఏంట్రా, జాగే ఏంట్రా.. మాంగే ఏంట్రా మైండ్ లెస్ ఫెలో.. అసలు అది జనగమణ అనుకున్నవా..? లేక నీ గజ్జి గజల్ అనుకున్నవా?  జాతీయ గీతం ‘జనగణమన’కు ఏపీఎన్జీవోల సభలో తీరని అవమానం జరిగింది. ప్రతి ఒక్కరిలో దేశభక్తిభావం పెంపొందించేవిధంగా విశ్వకవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘జనగణమన’ను సభలో బాణీని మార్చి.. తప్పులుతుప్పులుగా ఇష్టానుసారం పాడారు. దానికితోడు నాయకులు తమ అసందర్భ ప్రేలాపనలతో జాతీయ గీతాన్ని పలు సందర్భాల్లో కించపరిచారు. సభ మధ్యలోనే సభికులు వెళ్లిపోతుండటం చూసిన అశోక్‌బాబు వారిని కూర్చోవాలని కోరుతూ కొద్దిసేపట్లో ‘జనగణమన పాట ఉంటుంది. అది పూర్తయ్యాక 5గంటలకే సభను ముగిద్దాం’ అని మైకులో రెండుసార్లు చెప్పారు. అనంతరం సభ ముగింపులో మైకు అందుకున్న గజల్ శ్రీనివాస్ ‘జనగణమన’ ఆలాపనలో తప్పులకు పాల్పడ్డాడు.

పలు సందర్భాల్లో తడబడి గీతంలోని పదాలను తప్పుగా ఉచ్చరించాడు. జాతీయ గీతం ఆరంభం నుంచి చివరివరకు ఇదే తంతు కొనసాగింది. వేదికపై ఉన్న నేతలు కూడా ఆయనకు శృతి కలిపి.. అవే తప్పులు చేశారు. పైగా ‘జనగణమన’ మార్చింగ్ బాణినీ వదిలి సొంత బాణీలో పాడే ప్రయత్నం చేశారు. జాతీయ గీతానికి తీరని అవమానం కలిగించారు.  గతంలో ప్రముఖ సంగీత దర్శకుడు రహమాన్ వందేమాతరం బాణీ మార్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

గజల్ శ్రీనివాస్‌పై కేసు నమోదు
‘సేవ్ ఆంధ్రవూపదేశ్’ సభలో గజల్ శ్రీనివాస్ జాతీయ గీతాన్ని తప్పుగా పాడి.. అవమానించారని, ఇందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో న్యాయవాది బద్ధం నర్సింహాడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిజామాబాద్‌లోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లోనూ గజల్ శ్రీనివాస్‌పై టీఎన్జీవో, టీజేఎఫ్, టీవీవీ నాయకులు ఫిర్యాదు చేశారు.

This entry was posted in ARTICLES, VIDEOS.

One Response to మాంగే ఏంట్రా మైండ్ లెస్ ఫెలో..

  1. రమేశ్ says:

    జాతీయ గీతాలపన సమయములో ఒక ఒకడు పంది లాగా వెనుకల నములుతూ చూస్తున్నాడు. ఒకడేమో బుద్దిలేక తప్పులు పాడుతున్నాడు వాడి గజ్జి, వీడి తిండి….. చెత్తనాయళ్ళు …ఓ దేశమా ఈ వెదవలను భరించే శక్తి నీకు కావలమ్మ ……