ఓరుగల్లుకు.. కీర్తి కిరీటం!

మన ఓరుగల్లు నగరానికి తీపి కబురు. నగరి సిగలో చరివూతకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ పర్యాటక వారసత్వ నగరంగా వరంగల్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఘనమైన వారసత్వ సంపద, వేల ఏళ్ల నాటి చరిత్ర నగరాన్ని కీర్తి శిఖరాన నిలబెట్టాయి. కాకతీయుల నాటి సామ్రాజ్య పాలనలో నెలకొల్పిన వైభవ తోరణాలు నేడు కళారూపాలుగా కనువిందు చేస్తున్నాయి. రమణీయ శిల్పాల నృత్య వి లాసం, చారివూతక కట్టడాల అపూర్వ వైభవం ఈ గుర్తింపున కు ప్రధాన కారణాలు. 12వ శతాబ్దపు ఓరుగల్లును అరుదైన వారసత్వ నగరంగా గుర్తింపు పొందడం విశేషం.

అంతర్జాతీయ గుర్తింపు
దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కాకుంటే ఓరుగల్లుకు సుదీర్ఘకాలపు చరిత్ర ఉంది. ఈ కారణంగానే జిల్లాకు గుర్తింపు లభించింది. వారసత్వపు గుర్తింపు లక్ష్యం జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించడమే. దీంతో దేశంలో ని ప్రముఖ పర్యాటక కేంద్రాల సరనన జిల్లా చేరుతుంది. పర్యాటకుల రాక కూడా గణనీయం గా పెరుగుతుంది. దేశ, విదేశీ పర్యాటకులు నగరానికి రావడానికి ఆసక్తి చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగర ప్రజలకు కాకతీయుల చరివూతలో తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. నాటి నగర జీవన విధానం, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనా విధానం నేటి తరానికి ఓ పట్టాన అర్ధం కాదు. వీటిపై మరింత పరిశోధనాత్మక చరివూతను అందించగలిగితే ఇలాంటి గుర్తింపులు మరెన్నో వస్తాయి. దీనిమూలంగా యునెస్కో గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. పరోక్షంగా నగరానికి దేశ, విదేశీ ఆదాయం లభిస్తుంది. విదేశీ పర్యాటకులు ఇప్పటికే నగర చారివూతక కట్టడాలపై ఆసక్తి చూపిస్తున్నారు. పర్యాటక శాఖ లెక్కల ప్రకారం సగటున నెలకు 100మంది విదేశీ పర్యాటకులు, వేలసంఖ్యలో దేశ పర్యాటకులు వస్తున్నట్టు తెలుస్తున్నది. అంటే సంవత్సరానికి విదేశీ పర్యాటకులు వెయ్యి నుంచి 15వందల మంది వస్తున్నారు. రానున్న రోజుల్లో వీరి రాక పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి ఎం.శివాజి తెలిపారు. మరిన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తే విదేశీయులను ఎక్కువగా తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు.

ఉత్సవ వేళ…
కాకతీయ ఉత్సవాలను జరుపుకుంటున్న వేల జిల్లాకు వారసత్వ గుర్తింపు లభించడం విశేషం. చరిత్ర తాలూ కు వైభవాన్ని పున:స్మరించుకుంటున్న జిల్లాకు ఇది కచ్చితంగా శుభవార్తే. ప్రతినెల కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇక గుర్తింపుపై కూడా ఉత్సవాలు చేసుకోవాల్సిన తరుణం ఇదని జిల్లావాసులు అభివూపాయపడుతున్నారు. శిల్పకాంతులు పంచే రామప్ప, పరిపాలనా, ధీరత్వాన్ని చాటే ఓరుగల్లు ఖిల్లా, వైభవ తోరణం, కనువిందు చేసే వేయిస్తంభా ల ఆలయం, చారివూతక ఆనవాళ్లు ఉన్న ఘనపురం, పద్మాక్షి, భద్రకాళి, కటాక్షాపూర్ లాంటి అపురూప సంపద తరిగిపోనిది. కళావూపేమికుల మది నింపే జ్ఞాన సంపద ఇక్కడి సొం తం. ఈ సంపదను దేశ, విదేశీ ప్రజలకు గర్వంగా చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు వారసత్వ గుర్తింపు ఒక ఉన్నతమైన మార్గం.

This entry was posted in ARTICLES.

Comments are closed.