ఓయూ పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారానే తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో కూడా పీజీ ప్రవేశాలు కల్పిస్తారు. ఐదేళ్ల ఇంటిక్షిగేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలను కూడా ఈ నోటిఫికేషన్‌లోనే చేర్చారు. ఈ ఏడాది నోటిఫికేషన్ వివరాలను డైరెక్టర్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్ ప్రొఫెసర్ శివరాజ్ వెల్లడించారు. గతేడాది రూ.120గా ఉన్న దరఖాస్తు ఈ సారి రూ.140కి పెంచినట్లు తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు రూ.150 చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు మరో పది రూపాయలు అదనంగా పెంచినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేవారు డౌన్‌లోడ్ చేసుకున్న ఫారంకు ఒక సబ్జెక్టుకు రూ.340 డీడీతో పోస్టు ద్వారాగానీ, స్వయంగా గానీ అందజేయాలన్నారు. ఈసారి హాల్ టికెట్లు, ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాల్సిఉంటుందన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.