ఒరిగిన తెలంగాణ శిఖరం-బాపూజీ బలహీనవర్గాల బాంధవుడు

swearing-in-cer

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ! దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ, హైదరాబాద్ సంస్థాన విముక్తి ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిన ధన్యజీవి. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ గైర్‌ముల్కీ ఉద్యమాన్ని లేవదీసిన నేత. బాపూజీ ఎవరికీ బెదరకుండా తన అభివూపాయాలను కుండలు బద్దలు కొట్టినట్లుగా చెప్పే ధైర్యశాలి. ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందడ్డి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉంటూ తెలంగాణ ప్రాంతం వారికి చెందాల్సిన ఉద్యోగాలు ఆంధ్రా వారు లాగేసుకుంటున్న వైనాన్ని మంత్రివర్గ సమావేశంలో ఎండగట్టిన ధీశాలి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై కాసుతో ప్రత్యక్షంగా పోరాడి, తెలంగాణ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. బాపూజీ లేవనెత్తిన అంశాలపై నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేపట్టి, తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ ప్రాంత వ్యతిరేక నిర్ణయాలకు విసిగి వేసారిన బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం 1969లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పాటు అయ్యేంత వరకు ఎలాంటి రాజకీయ పదవులను చేపట్టబోనని ఆ రోజుల్లోనే కంకణబద్ధులు అయ్యారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం, సహకార సంఘాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి నిదర్శనంగా ఆయనను ఆ వర్గాలు ‘సహకార రత్న’ అనే బిరుదుతో సత్కరించుకున్నాయి. డెబ్బయవ దశకంలో బీసీ సంఘాలు కొండాలక్ష్మణ్, గౌతు లచ్చన్నను సన్మానించాయి. ఆ కార్యక్షికమంలోనే ఆయనకు ఆచార్య బిరుదునిచ్చి ప్రశంసించాయి.
with-Indira-Gandhi-at-Jal
వాంకిడి నుంచి హైదరాబాద్‌కు..
ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో సామాన్య కుటుంబంలో పుట్టిన లక్ష్మణ్‌కు రెండున్నరేళ్ల వయసులోనే తల్లి చనిపోయారు. తండ్రి పోస్ట్‌మెన్‌గాపనిచేసేవారు. ఐదుగురు సంతానంలో బాపూజీ చిన్నవాడు. వీరిలో ఈయన ఒక్కరే విద్యావంతుడయ్యారు. ఆసిఫాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన లక్ష్మణ్.. 1938లో హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసేందుకు అర్థికపరమైన ఇబ్బందులుండడంతో ఆరోజుల్లో హైకోర్టు నిర్వహిస్తున్న రెండేళ్ల న్యాయకోర్సులో చేరి, 1940లో 3వ గ్రేడు ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది విజయదశమి రోజున హైదరాబాద్‌లో లాయర్‌గా ప్రాక్టీసు ప్రారంభించారు. క్రమంగా కోర్సులను పూర్తిచేసి 1950లో హైకోర్టు అడ్వకేట్‌షిప్ పొందారు. అతి తక్కువ కాలంలోనే హైకోర్టులో క్రిమినల్ కేసులు వాదించే ప్రముఖుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు.
55---27-02-1959-father,-sis
మహాత్ముడే స్ఫూర్తి
1931లో నిజాం సంస్థాన సరిహద్దులోని రాజారామానిక్ గఢ్‌కు 15 మైళ్ళ దూరంలో జరిగే గాంధీ సభ ఉంది. దానికి వెళ్లొద్దని నిజాం ప్రభుత్వం ఆదేశించింది. లక్ష్మణ్ లెక్క చేయలేదు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లే. ఊరికి సమీపంగా వెళ్లే పెన్ గంగా నదిలో స్నానానికి వెళ్తున్నాని చెప్పి తన స్నేహితులతో కలిసి నదిని దాటి, 20 మైళ్లు కాలినడకన ప్రయాణించి ఈ సభలో పాల్గొన్నారు. ఆనాటి నుంచి చివరి క్షణం వరకు ఖద్దరు దస్తులను, గాంధీ టోపీని ధరించారు. 1942 జూన్ 20న స్టేట్ కాంగ్రెస్ సత్యాక్షిగహాల బృందాన్ని అభినందిస్తూ నినాదాలు చేసి అరెస్టు అయ్యారు. వందేమాతరం ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. జైలులో రాజకీయ ఖైదీల సౌకర్యాల కోసం నడుం కట్టారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో సుల్తాన్‌బజార్ తంతి తపాల కార్యాలయంపైన, రెసిడెన్సీపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వంటి కార్యక్షికమాలను నిర్వహించారు. 1940 జూన్ 3న ‘భారతదేశ విప్లవ సమస్యలు’ అనే అంశంపై డెహరాడూన్‌లో విశ్వ విఖ్యాత విప్లవకారుడు ఎంఎన్ రాయ్ చేసిన ప్రసంగం లక్ష్మణ్‌ను ఎంతో ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆయన ఎంఎన్ రాయ్ రచనలను ఉర్దూలోకి అనువదించారు. విప్లవ కార్యకలాపాలతో భీతిల్లిన ప్రభుత్వం 1941 జులైలో సీఐడీ పోలీసులతో కొండా లక్ష్మణ్ ఇంటిని సోదా చేయించింది. భారతదేశంలో నిజాం సంస్థాన విలీన ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో లక్ష్మణ్ విప్లవకారుడని ప్రకటించి, ఆయన అరెస్టుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇంటిచుట్టూ గస్తీ ఉన్నా, ఎవ్వరూ గుర్తుపట్టలేని వేషంలో లక్ష్మణ్ తప్పించుకుపోయారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తన మిత్రులతో కలిసి ‘స్వాతంవూతోద్యమవాణి’గా మైసూరు రాష్ట్రంలో రేడియో కేంద్రాన్ని ఏర్పాటుచేసి, అప్పటి దక్కన్ రేడియో జాతీయ వ్యతిరేక దుష్ప్రచారాన్ని, రజాకార్ల కుయుక్తులను విఫలం చేయడానికి ఉపయోగించుకున్నారు. క్విట్ ఇండియా, స్వాతంత్య్ర సమరం, హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటాల కాలంలో అనేకసార్లు బాపూజీ అజ్ఞాతవాసం గడిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా షోలాపూర్, పుణె నగరాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. ఈ క్యాంపుల్లోనే బాంబులు విసరడంలో శిక్షణ ఇచ్చారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌పై బాంబు విసిరిన నారాయణరావు పవార్, ఆ బృందంలో సభ్యుడైన గండయ్య.. లక్ష్మణ్ వద్ద శిక్షణ పొందారు. అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్‌కు సమీపంలో నిజాం హత్యకువిఫలయత్నం చేశారు. ఈ ఘటన తర్వాత ఆయనపై 13 వారెంట్లు జారీ అయ్యాయి. కానీ ఆయన పోలీసులకు చిక్కలేదు.తన పోరాటానికి అవరోధం ఏర్పడకూడదని కొన్నేళ్ళ పాటు మరాఠ్వాడాలో ఆజ్ఞాతంగా ఉండి పోరు సాగించారు.
35-----CHENETHA-SADASSU-WIT
కాంగ్రెస్‌తో బంధం…
లక్ష్మణ్ 1945లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత 1947 మే నెలలో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జీ బాబురావు, కేవీ కేశవులుతో కలిసి కిసాన్ మహాసభ ఏర్పాటుచేశారు. మహాసభను జయవూపకాశ్‌నారాయణ్ ప్రారంభించాల్సి ఉండింది. ఆయన హైదరాబాద్ వరకూ వచ్చినా.. నిజాం సర్కార్ నిషేధం వల్ల తిరిగి వెళ్ళిపోయారు. స్వాతంవూత్యానంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ శాసనసభలో, నిర్మాణాత్మక కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడిన తొలి శాసనసభలో ప్రముఖ పాత్ర పోషించారు.1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత చిన్నకొండూరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఎన్నికయ్యారు. నీలం సంజీవడ్డి సీఎంగా ఉన్న కాలంలో 1957లో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1960-62లో సంజీవయ్య మంత్రివర్గంలో ఎక్సైజ్, లఘు పరిక్షిశమలు, టెక్స్‌టైల్స్ అండ్ హాండ్లూమ్ శాఖ మంత్రిగా, 1967-69 మధ్య కాలంలో కాసు బ్రహ్మానందడ్డి కేబినెట్‌లో కార్మిక శాఖ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రిగా ఉన్నారు. సంజీవయ్యను సీఎంఅభ్యర్థిగా నిర్ణయించడంలో బాపూజీ కృషి ఎంతో ఉంది. తన నివాసం ‘జలదృశ్యం’లో పెద్దలతో సమావేశాలు నిర్వహించి, దేశంలో తొలిసారి ఒక దళితుడిని ముఖ్యమంవూతిని చేయడం చారివూతాత్మక సంఘటన.

This entry was posted in TELANGANA MONAGALLU, Top Stories.

Comments are closed.