ఏమి నేరం చేసెరా! తెలంగాణకు ఎందుకీ కడుపు కోతరా!!

హైదరాబాద్ : తెలంగాణలో మరో తల్లికి కడుపుకోత మిగిలింది. నయవంచక కాంగ్రెస్ పార్టీ మోసానికి ఇవాళ కర్మన్‌ఘట్ పవన్‌పురి కాలనీలో పాలమూరు మట్టిబిడ్డ బీటెక్ విద్యార్థి దినేష్ చంద్ర నిండుప్రాణాన్ని బలిపెట్టుకున్నాడు. నవమాసాలు మోసి.. కోటి ఆశలతో.. పెంచుకున్న కూలి తల్లుల కడుపును కాల్చిందేవరు.. తలెత్తుకొని బ్రతుకును పండించుకోవాల్సిన తెలంగాణ యువతను బలిపీఠం ఎక్కిస్తున్నది ఎవరు.. ఇంకేవరు తెలంగాణ ఉద్యమంపై కాలకూట విషం చిమ్ముతున్న సీమాంధ్ర నాయకులు వారి డబ్బు సంచులకు అమ్ముడు పోయిన హస్తిన హస్తం పెద్దలు.

నాడు నెహ్రూ సైన్యాలు 1948లో మూడు వేలమంది రైతాంగ కార్యకర్తలను చంపి ‘కోటిరత్నాలతెలంగాణను నిలువెళ్లగాయాల వీణ’ గా మార్చాడు. అప్పటి నుండి ఇప్పటిదాక తెలంగాణను ఎవడేలినా.. రక్తపుటేరు పారిస్తూనే ఉన్నారు. అది 69-71 ఉద్యమంలో ఇందిరగాంధీ, కాసు బ్రహ్మనందారెడ్డి, వెంగళరావు 370 మంది తెలంగాణ విద్యార్థులను తుపాకీ తూటాలకు బలి తీసుకుని తెలంగాణ ఉద్యమంలో మరో రక్తచరిత్రను లిఖించారు.

నిప్పుకండ్ల తొడేలు చంద్రబాబు తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికించి.. పాట గుండెలో తూట దింపింది.. తెలంగాణలో మలి దశ ఉద్యంలో ముఖ్యంగా 2009 డిసెంబర్ 9 తర్వాత సీమాంధ్ర రాజకీయ పార్టీల కారుకూతలతో, సోనియా మౌనం, కాంగ్రెస్ నయవంచనతో దాదాపు 1000 మంది తెలంగాణ తల్లుల కడుపు కాల్చింది. ఇప్పుడు నెల రోజుల్లో తెలంగాణను తేల్చుడేనని హస్తిన హస్తం పెద్దలు ఆజాద్, షిండే చెప్పి.. ఆశలు పెంచి ఈ ఆజాద్ మోసపు జాదు మాటలతో కలత చెందిన, గుండె జారిన తెలంగాణ బిడ్డలు మళ్లీ వరుస ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారు.

ఈ నెలలో ఇవాళ్టి వరకు9 మంది నిండు ప్రాణాలను నెలా అంటే 30 రోజులా.. సంప్రదింపులు జరుపుతాం అన్న ఆజాద్, షిండేల మాటలు బలి తీసుకున్నాయి. వీరి మాటలకు ఈ నెల రోజుల్లో ఆత్మబలిదానాలు చేసుకున్న వారి జాబితా-

1. ఇంటర్‌విద్యార్థి చాకలి నరేష్(18) ఈ నెల 29 న కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నడు. గ్రామం. శమ్నాపూర్ మండలం,జిల్లా మెదక్

tg2

2. ఐటీఐ విద్యార్థి, లక్షెట్టి రాజేందర్ (18) జనవరి 3న పురుగుల మందు తాగి ఆత్మహత్య.తరుపల్లి, కాల్వశ్రీరంపూర్, కరీంనగర్ జిల్లా
3. నేతకార్మికుడు నాసాని శివప్రసాద్ (32) జనవరి 14న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య, సిరిసిల్ల శాంతినగర్, కరీంనగర్ జిల్లా

tg6

4. డిగ్రీ విద్యార్థి రంజిత్ (24) జనవరి 21న పురుగులమందు తాగి ఆత్మహత్య.రేగోండ మండలం భాగిర్ధిపేట, వరంగల్ జిల్లా

tg3

5. మహేశ్ యాదవ్ (26) జనవరి 27న (కిరోసిన్) నాగంపేట, గంభీరావుపేట మండలం, కరీంనగర్ జిల్లా (ఇతని కుటుంబ సభ్యులు షిండే, ఆజాద్‌పై సిరిసిల్ల డీఎస్‌పీకి ఫిర్యాదు చేశారు.)
tg1

6. భారతపు చంద్రశేఖర్ (28) జనవరి 27న రైలుకిందపడి ఆత్మహత్య. రాయికల్, కరీంనగర్ జిల్లా tg5

7.భారతం శంకర్ (30) మంచిర్యాలలో రైలు కిండపడి ఆత్మహత్యtg4

8. జర్నలిస్ట్ గంధమల్ల రాములు (40) జనవరం 29న భువనగిరిలో బస్సుకు ఎదురెళ్లి బలిదానం.
9. బీటెక్ విద్యార్థి దినేష్ చంద్ర (18) ఇవాళ (జనవరి 30) ఉదయం కర్మన్‌ఘట్ పవన్‌పూరి కాలనీలో ఆత్మహత్య. స్వస్ధలం పాలమూరు జిల్లా.

This entry was posted in ARTICLES.

Comments are closed.