‘ఏబీఎన్ దగుల్బాజీ ఛానల్’

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామరావుపై విషం చిమ్మిన ఏబీఎన్ ఛానల్‌పై టీఆర్‌ఎస్ నేతలు ధ్వజమెత్తారు. ఏబీఎన్ దమ్మున్న ఛానలా? దగ్బులాజీ ఛానలా? అని ప్రశ్నించారు. ఉద్యమంపై విషం చిమ్మడంలో భాగంగా కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే ఏబీఎన్ ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే ముక్కు భూమికి రాస్తావా అని రాధాకృష్ణాకు సవాల్ చేశారు. పొద్దందాక సలహాలు చెప్తూ మీటింగ్.. రాత్రి అయితే బూతు పురాణం చూపించే ఛానల్ టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేయడం తగదు అన్నారు.

తెలంగాణ ప్రజలు మీ పేపర్, ఛానల్‌ను బహిష్కరించే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఒక ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోవాల్సిన జర్నలిజం విలువలు కూడా రాధాకృష్ణకు లేవు అని మండిపడ్డారు. పంక్చరైన టీడీపీని అధికారంలోకి తీసుకు రావడానికి ఏబీఎన్ దేనికైనా తెగిస్తోందన్నారు. టీడీపీ అధికార ఛానల్‌గా ఏబీఎన్ మారిపోయిందని ఆరోపించారు. ఏబీఎన్ అంటే ఆంధ్రా బ్లాక్‌మెయిల్ నెట్‌వర్క్ అని పేర్కొన్నారు. కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై టీఆర్‌ఎస్ చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాధాకృష్ణ చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని చెప్పారు. మహాత్మాగాంధీని కించపరిచే విధంగా కథనాలు ప్రసారం చేసిన నీచ చరిత్ర రాధాకృష్ణది అని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛను మలినం చేయవద్దని రాధాకృష్ణకు సూచించారు. రాధాకృష్ణకు జర్నలిజంపై చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.