ఏప్రిల్ 3న విస్తృతస్థాయి సమావేశం: కోదండరాం

ఏప్రిల్ 3న జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. ఈ సమావేశం చాలా కీలకమైందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలోనే తెలంగాణ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని అన్నారు. విజయవాడ రహదారిపై నిర్వహించబోయే సడక్‌బంద్, ఛలో అసెంబ్లీ కార్యాక్రమాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బెంగళూరు రహదారిపై తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించిన ‘సడక్‌బంద్-1’ విజయవంతమైందని జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సడక్‌బంద్ కార్యక్రమం సందర్భంగా పలువురు తెలంగాణ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. త్వరలో విజయవాడ రహదారిని నిర్బంధం చేస్తూ ‘సడక్‌బంద్-2’ను నిర్వహించనున్నట్టు కోదండరాం ప్రకటించారు. నిన్న నల్లగొండలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటించిన సందర్భంగా జిల్లాలో పలువురు తెలంగాణ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం, బైండోవర్లు చేయడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందని ఛైర్మన్ కోదండరాం అన్నారు. ఈ విచ్ఛలవిడి అరెస్టులను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపాలని చూస్తే జరుగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

ఏప్రిల్ 3న విస్తృతస్థాయి సమావేశం: కోదండరాం
ఏప్రిల్ 3న జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు జేఏసీ ఛైర్మన్ కోదండరాం ప్రకటించారు. ఈ సమావేశం చాలా కీలకమైందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలోనే తెలంగాణ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని అన్నారు. విజయవాడ రహదారిపై నిర్వహించబోయే సడక్‌బంద్, ఛలో అసెంబ్లీ కార్యాక్రమాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.