ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ

ఢిల్లీలోని ఏపీ భవన్ ఆర్‌సీ(సిడెంట్ కమిషనర్) శశాంక్ గోయెల్ ప్రవర్తన సరిగా లేదని, కాంట్రాక్టు ఉద్యోగులతో ఆయన, ఆయన కుటుంబం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రానికే కలంకం తెచ్చేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తన మాటవిననందుకు దాదాపు పదిమంది కాంట్రాక్టు ఉద్యోగులను శశాంక్ డిస్మిస్ చేసి రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోయెల్ వ్యవహారంపై హైదరాబాద్ వెళ్లగానే సీఎంతో, సంబంధిత అధికారులకు ఫిర్యాదుచేస్తానని చెప్పారు. గత కొద్దికాలంగా శశాంక్ గోయెల్, ఆయన కుంటుంబం ఏపీ భవన్‌లో పనిచేసే ఆఫీస్ బాయ్స్, తదితర ఉద్యోగులపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. వీరిని తన నివాసంలో పనికి కూడా పిలిపించుకుంటున్న శశాంక్ భార్య, కుటుంబ సభ్యులు నానాచాకిరి చేయించుకుని, చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వాపోయారు. ఓ ఉద్యోగిని ఆర్‌సీ కుటుంబ సభ్యులు కాల్చి వాతలు పెట్టిన సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. జీవోఎంతో సమావేశం కోసం ఏపీ భవన్‌కు వెళ్లి న నారాయణకు బాధితులు గోడు వెల్లబోసుకున్నారని సమాచారం.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.