ఏపీ ఎన్జీవో హౌసింగ్ సోసైటీలోరూ.13కోట్ల కుంభకోణం -లబ్ధిదారుల ఎంపికలో గోల్‌మాల్

-నిబంధనల బేఖాతర్, జీవోలకు పాతర
-అక్రమంగా 1,644 లబ్ధిదారుల ఎంపిక
-అర్హులైన ఎన్జీవోలకు దక్కని ఇళ్ల స్థలాలు
-ఎన్‌ఫోర్స్‌మెంట్, రిజివూస్టార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీ దర్యాప్తులో వెల్లడి
-హౌసింగ్ సొసైటీ రద్దు.. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు సిఫారసు
-ప్రత్యేక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలని సూచన
-సొసైటీ అధ్యక్ష, కార్యదర్శి గోపాల్‌డ్డి, చంద్రశేఖర్‌డ్డిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి ఉద్దేశించిన ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీలో భారీ అక్రమాలకు తెరతీశారు నిర్వాహకులు. కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను మింగేశారు. జీవితాంతం ప్రభుత్వంలో సేవలు చేసినందుకు కనీసం సొంత ఇంటి స్థలమైన దక్కుతుందనే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రభుత్వ ఉత్తర్వులను, నిబంధనలను తుంగలొకి తొక్కి సొసైటీ ఇంటి స్థలాల కేటాయింపు, నిధుల వ్యయంలో అక్షరాల రూ.13కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఈ మేరకు ఏపీ ఎన్జీవో సోసైటీలో జరిగిన భారీ అక్రమాలు రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటీవ్ సొసైటీస్ దర్యాప్తులో వెలుగుచూడటంతో సొసైటీ నిర్వాహకులైన అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్‌డ్డి, చంద్రశేఖర్‌డ్డిపై బుధవారం ఆబిడ్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. సొసైటీని రద్దు చేసి, వారిద్దరినీ వెంటనే అరెస్టు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్లితే..
జంట నగరాల పరిధిలోని నాన్ గెజిటెడ్ ఆఫీసర్లలకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 10 జూలై 1991లో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నంబర్ 59ను విడుదల చేయగా, ఉద్యోగుల హౌసింగ్ పథకం ఆశయాలను-లక్ష్యాల సాధన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ 10 జూలై 1991లో మరో జీవో (నం590)ను జారీచేసింది. ఇందులో భాగంగా గచ్చిబౌలి వద్ద 477 ఎకరాల ప్రభుత్వ భూమిని (సర్వే నెంబర్‌లు 36,37) కేటాయిస్తూ ఉత్తర్వులు (జీవో నం 50) జారీచేసింది. ఎన్జీవోల ఇంటి స్థలాల కేటాయింపుల మీద అధ్యయనం జరిపిన ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 11 జూలై 1992లో హౌజింగ్ సొసైటీ, ఇళ్ల స్థలాల కేటాయింపులపై విధివిధానాలు, నిబంధనలను వెల్లడిస్తూ ప్రత్యేకంగా జీవో (నం 633)ను జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన ఏపీ ఎన్జీవో మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ అక్రమాలకు తెరతీసింది. సొసైటీ నిర్వాహకులు.. సభ్యుల నుంచి సేకరించిన నిధులు, వాటి వయ్యంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. సొసైటీ మొత్తం నిధులు రూ.1 కోట్ల కాగా, రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు కాగా, మిగితా రూ.13కోట్ల రూపాయాలను సొసైటీ నిర్వాహకులు కాజేశారు. ఖర్చుచేసిన రూ.5కోట్ల విషయంలోనూ పారదర్శకత, సరైన లెక్కాపద్దులు లేవని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆర్‌సీఎస్ నివేదికలు వెల్లడి చేశాయి. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా లాటరీ విధానంలో ఇళ్ల స్థలాల కేటాయింపులు నిర్వహించారు.

ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు, సొసైటీ బైలా నిబంధనలకు విరుద్ధంగా 7 ఏప్రిల్ 2010నాడు లాటరీ విధానంలో 1644 లబ్ధిదారులను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీనియారిటీ ప్రాతిపదికన స్థలాల కేటాయింపులు చేయాలి. కానీ నిర్వాహకులు నిబంధనలను తుంగలో తొక్కడంతో ఏళ్ల తరబడి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సైతం ఇంటి స్థలాలు అందని ద్రాక్షగా మారాయి. వేలాదిమంది ఉద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. సొసైటీ నిర్వాహకుల అక్రమాలపై ఏపీ గర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసిమేషన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అప్పటి సీఎం కే రోశయ్య ఏపీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డైరెక్టర్ జనరల్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో సొసైటీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ మేరకు డిజి విజిపూన్స్‌అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ కమిటీ 1అక్టోబర్ 2012న ప్రభుత్వానికి సమక్షిగమైన నివేదిక సమర్పించింది. ఈ నివేదిక 1,644 లబ్ధిదారుల ఎంపిక చట్ట వ్యతిరేకంగా జరిగిందని, డెవలప్‌మెంట్ నిధులను కాజేశారని, అక్రమాలు- అవినీతి వ్యవహారాలపై లోతైన అధ్యయనం కోసం ఈ వ్యవహారాన్ని ఏసీబీ(అవినితీ నిరోధక శాఖ)కు అప్పగించాలని సిఫారసు చేయగా, గత తొమ్మిది నెలలలో దీనిపై ప్రభుత్వం చర్యలకు పూనుకోలేదు. సొసైటీ అక్రమాలపై ఉద్యమాన్ని సాగిస్తున్న ఉద్యోగులు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసొసియేషన్ (రిజిస్టర్57-2010) అధ్యక్షుడు కే సూర్యనారాయణ సారథ్యంలోని ప్రతినిధి బృందం, 641 మంది సభ్యుల బృందం వేర్వేరుగా ఏపీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ప్రకారం విచారణ జరపాలని కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు విన్నపాన్ని సమర్పించారు. దీంతో రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటీవ్ సొసైటీస్(ఆర్‌సీఎస్) హైదరాబాద్.. అర్బన్ డీసీవో జీ శ్రీనివాసరావును విచారణ అధికారిగా నియమించారు. సొసైటీ వ్యవహారాలపై విచారణ జరిపిన డీసీవో 2013, మే 6న సొసైటీ అక్రమ వ్యవహారాలపై సమక్షిగమైన నివేదికను రిజిస్ట్రార్‌కు సమర్పించారు. ఈ నివేదికలో రూ.13కోట్ల దుర్వినియోగంతోపాటు ప్రభుత్వ ఉత్తర్వులు, సొసైటీ బైలా నిబంధనల అతిక్షికమణ, సొసైటీ అధ్యక్ష, కార్యదర్శి గోపాల్‌డ్డి, చంద్రశేఖర్‌డ్డి అవినీతి, అక్రమ బాగోతాలను వెలుగులోకి తెచ్చారు.

గోపాల్‌డ్డి, చంద్రశేఖర్‌డ్డిపై ఫిర్యాదు
డీసీవో నివేదిక ఆధారంగా సొసైటీ అధ్యక్ష, కార్యదర్శి గోపాల్‌డ్డి, చంద్రశేఖర్‌డిపై చర్యలను తీసుకోవాలని కోరుతూ బుధవారం అబిడ్స్ పోలీసు స్టేషన్‌లో డిప్యూటీ రిజిస్ట్రోర్ హరి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. కోరుతూ కో-ఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజివూస్టార్ హరి బుధవారం అబిడ్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు సమర్పించారు. కో-ఆపరేటీవ్ సొసైటీ సమర్పించిన నివేదికలో తక్షణమే సొసైటీ రద్దు చేయాలని, నిర్వహణ నిమిత్తం ప్రత్యేకంగా ఆడ్మినిస్ట్రేటర్ నియామించాలని, అలాగే లాటరీ విధానంలో గుర్తించిన 1,644 లబ్ధిదారుల జాబితా రద్దుచేసి, సీనియారిటీ ప్రాతిపదికన లబ్ధిదారుల ఎంపిక చేయాలని సిఫారసు చేసింది. దీంతోపాటు రూ.13కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధ్యక్ష, కార్యదర్శి నుంచి వాటిని రీకవరీ చేయాలని, తప్పడు ధృవీకరణ పత్రాలతో సొసైటీలో సభ్యత్వం పొందిన చంద్రశేఖర్‌డ్డి (కార్యదర్శి), గిరిధర్(ఉపాధ్యక్షుడు) బైలా ప్రకారం ఆటోమెటిక్‌గా సభ్యత్వం కోల్పోయారని నివేదిక స్పష్టంచేసింది.

వెంటనే సొసైటీ రద్దు చేయాలి:ఎంప్లాయీస్ అసొసియేషన్ డిమాండ్
ఏపీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక, కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ నివేదికల ఆధారంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని, సొసైటీ బోర్డును రద్దు చేసి, రూ.13కోట్ల నిధుల రీకవరీ చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధ్యక్ష, కార్యదర్శిలను వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్రవూపదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసొసిమేషన్ డిమాండ్ చేసింది. సొసైటీ కార్యక్షికమాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఆడ్మినిస్ట్రేటర్ నియామించి.. నిబంధనలకు విరుద్ధంగా రూపొందించిన 1,644 లబ్ధిదారుల జాబితా రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఓ ప్రకటనలో అసొసియేషన్ అధక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, పీ సుబ్బరాయన్, గౌరవ సలహాదారు ఆర్ వేదవూపసాద్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ జనరల్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్, రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీల విచారణలో హౌసింగ్ సొసైటీ అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ అయిందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.